Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీ బాధను నీకోసం ఇలా తీర్చనియ్... అతడి హృదయంపై ఆమె తలవాల్చింది... రేప్ విక్టిమ్ స్టోరీ

అనుకోకుండా కామాంధుల చేతుల్లో చిక్కిన ఓ యువతి అత్యాచారానికి గురవడం, ఆ తర్వాత సమాజంలో ఆమెకు ఎదురయ్యే ఇబ్బందులు.. ఇలాంటి జీవితాలు వున్నాయి. అలాగే ఇలాంటి ఇతివృత్తాలతో చాలా సినిమాలు కూడా వచ్చాయి. వెంకటేష్, సౌందర్య నటించిన పవిత్ర బంధం ఇలాంటిదే. ఐతే అత్యాచా

నీ బాధను నీకోసం ఇలా తీర్చనియ్... అతడి హృదయంపై ఆమె తలవాల్చింది... రేప్ విక్టిమ్ స్టోరీ
, సోమవారం, 10 ఏప్రియల్ 2017 (15:07 IST)
అనుకోకుండా కామాంధుల చేతుల్లో చిక్కిన ఓ యువతి అత్యాచారానికి గురవడం, ఆ తర్వాత సమాజంలో ఆమెకు ఎదురయ్యే ఇబ్బందులు.. ఇలాంటి జీవితాలు వున్నాయి. అలాగే ఇలాంటి ఇతివృత్తాలతో చాలా సినిమాలు కూడా వచ్చాయి. వెంకటేష్, సౌందర్య నటించిన పవిత్ర బంధం ఇలాంటిదే. ఐతే అత్యాచార బాధితురాలు పడే మానసిక నరకం ఎలా వుంటుందో మనస్తత్వ శాస్త్రవేత్తలు పలు వ్యాసాల ద్వారా విశదీకరిస్తుంటారు. ఇలాంటి అనుభవాలన్నిటినీ క్రోఢీకరించి ఓ వ్యాసం...
 
ఏడేళ్ల క్రితం అత్యాచారానికి గురైన ఓ మహిళ అసలు మగాళ్లంటేనే అసహ్యించుకుంటుంది. తనపై మగాడి నీడే పడకూడదన్న స్థాయికి వెళ్లిపోతుంది. మహిళలు నిర్వహించే కంపెనీలోనే ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతుంది. అలాంటి ఆమెకు ఓ రోజు ఓ యువకుడు పరిచయమవుతాడు. పురుషుడంటేనే ఛీకొట్టే ఆమె మనసు లయ తప్పుతుంది. అతడు కూడా ఆమె వైపు ఆకర్షితుడవుతాడు. ఓ రోజు అతడు ఆమెను సమీపిస్తుండగా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతడు అల్లంత దూరంలో వుండగానే పక్క వీధిలోకి వెళ్లిపోయి కనిపించుకుండా దాక్కుంటుంది. 
 
అతడు... ఆ వీధిలో అంతా కలియతిరిగి వెళ్లిపోతాడు. మరుసటి రోజు సదరు యువకుడు ఆమె రోజువారీ నిలబడే ప్రాంతానికి దగ్గర్లోనే దాక్కుని వుంటాడు. ఆమె అక్కడికి వచ్చి నిలబడి వుండగానే చటుక్కున ఆమె ముందుకు వచ్చేస్తాడు. ఆమె అతడివైపు కోపంగా చూస్తుండగానే... ఏంటండీ ఎవరినీ పట్టించుకోని మీరు నన్ను మాత్రమే ఎందుకు చూస్తున్నారంటూ ఎదురు ప్రశ్న వేశాడు. దాంతో షాక్ తిన్న ఆమె అలాంటిదేమీ లేదని బుకాయిస్తుంది. కానీ అతడు మాత్రం ఆమెను ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తూనే వున్నాడు. 
 
అప్పటివరకూ ఏ మగాడికి ఇంత ఓపిగ్గా సమాధానాలు చెప్పింది లేదు. కానీ ఇతడికి ఎందుకు తను సమాధానాలిస్తుంది.... అలా ఆమె ఆలోచనలు సాగాయి. బహుశా.. ప్రేమంటే ఇదేనేమో...? అలా సాగుతుండగానే ఆమెకు అతడు ఓ మంచి స్నేహితుడయిపోయాడు. తన మనసులో మగాళ్ల పట్ల వున్న ద్వేషం ఈ ఒక్క మగాడి ప్రవర్తనతో మాయమైంది. మెల్లగా స్నేహం నుంచి ప్రేమ... కొన్ని రోజులకు పెళ్లి వరకూ వెళ్లింది. 
 
అపుడామె తన జీవితంలో జరిగిన దారుణమైన చేదు నిజాన్ని అతడి ముందు వుంచింది. వాటి గురించి తర్వాత మాట్లాడుదాం... ఇప్పుడు పెళ్లి చేసుకుందాం... అంటూ నెల తిరక్కుండానే పెళ్లాడేశాడు. ఆ రోజు అతని హృదయంపై ఆమె... మళ్లీ జీవితంలో జరిగిన చేదు వార్తను చెప్పబోతోంది... అప్పుడతడు.. ''నీ బాధను నీకోసం ఇలా తీర్చనియ్... అంటూ ఆమెను మరో లోకం అంచుల శిఖరాలకు తీసుకెళ్లాడు. ఆమె మనసులో ఇప్పుడు అంతా మధురమే... ఆమె అతడి హృదయంపై తలవాల్చింది. కొత్త జీవితంలోకి వెళ్లిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ ముక్కలేనిదే ముద్ద దిగదా..? ఐతే ఈ జబ్బులూ తప్పవ్..