Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

Bobby Kolli, Kalyan Krishna, Ananya Nagalla, Ravi Teja and others

డీవీ

, మంగళవారం, 24 డిశెంబరు 2024 (17:07 IST)
Bobby Kolli, Kalyan Krishna, Ananya Nagalla, Ravi Teja and others
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌'. అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
 
డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ, నేను, మోహన్ కలిసి ఒక డైరెక్టర్ దగ్గర రైటర్స్ గా పని చేసాం. ఈ సినిమాతో తను దూసుకుపోతాడనే నమ్మకం ఉంది. చాలా అద్భుతంగా తీసాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అనన్య కి చాలా సక్సెస్ లు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు. 
 
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమా కథని నమ్మే సినిమా చేసిన రమణ రెడ్డి కి కంగ్రాజులేషన్స్. చిన్న సినిమాలు పెద్ద హిట్ లు కావాలని ఎప్పుడూ కోరుకుంటాను. అనన్య గారు ఏ క్యారెక్టర్ చేసిన అందులో సంథింగ్ స్పెషల్ ఉంటుంది. ఈ సినిమా అందరికీ పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వంశి గారు ఈ సినిమాకి చాలా బాగా యాడ్ అయ్యారని నమ్ముతున్నాను. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్' అన్నారు. 
 
నిర్మాత ధీరజ్ మాట్లాడుతూ, ఈ సినిమా నేను చూశాను లాస్ట్ 40 మినిట్స్ సినిమా అదిరిపోతుంది. ఇందులో చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. లాస్ట్ వరకు ఫుల్ గా ఎంగేజ్ చేస్తుంది కంటెంట్ చూసి ఈ సినిమాని వంశీ గారు తీసుకున్నారు.  ఈ సినిమా మీ అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన బాబి గారికి కళ్యాణ్ గారికి థాంక్యూ' అన్నారు 
 
ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం ఈ సినిమా చూశాను. డైరెక్టర్ గారికి హిట్ నుంచి సూపర్ హిట్ చేద్దామని చెప్పాను. డైరెక్టర్ గారు నిర్మాత చాలా కోపరేటివ్. చెప్పిన సజెషన్స్ అన్నిటికీ యాక్సెప్ట్ చేశారు. ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది. ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్లే కొద్ది కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి. 2018 పొలిమేర 2, కమిటీ కుర్రాళ్ళు క... చిత్రాలకు దేని అడ్వాంటేజ్ దానికి ఉంది. కానీ ఈ సినిమాకు వచ్చేసరికి లీడ్ యాక్టర్స్ సపోర్ట్ ఉంటే ప్రమోషన్స్ ని ఇంకా బలంగా తీసుకెళ్లొచ్చని నమ్మా. కానీ కొన్ని కారణాలవల్ల మేము అనుకున్నట్లు కొన్ని కుదరలేదు. ఏదేమైనప్పటికీ ఈ సినిమా కంటెంట్ ని నేను బలంగా నమ్మాను. ఆకంటెంట్ నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను  అన్నారు. 
 
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ,  నన్ను నమ్మి ఈ రోల్ ఇచ్చిన మోహన్ గారికి థాంక్ యూ. వంశీ గారు ఈ ప్రాజెక్ట్ లోకి రావడం వలన సినిమాపై అందరికీ మరింత నమ్మకం కలిగింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. ఇప్పటివరకూ చాలా మంచి పాత్రలు, సినిమాలు చేశాను. ఈ సినిమాతో ఒక సక్సెస్ ఫుల్ యాక్టర్ గా సక్సెస్ మీట్ లో కలుద్దామని కోరుకుంటున్నాను' అన్నారు. 
 
యాక్టర్ రవితేజ మహాదాస్యం మాట్లాడుతూ, నటుడిగా ఈ సినిమా నాకు చాలా కీలకం, నిర్మాత చాలా బాధ్యతగా సినిమాని నిర్మించారు. మోహన్ గారు అద్భుతంగా తీశారు. అనన్యతో కలసి నటించడం ఆనందంగా వుంది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి' అని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్