Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Advertiesment
Rajasab teser 35 millions

దేవీ

, మంగళవారం, 17 జూన్ 2025 (09:31 IST)
Rajasab teser 35 millions
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్".  ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "రాజా సాబ్" సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది.

Maruthi- producers
నిన్న హైదరాబాద్ లో ఈ చిత్ర టీజర్ లాంఛ్ అనంతరం హైదరాబాద్ శివార్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన రాజాసాబ్ సెట్ ను విలేకరులకు చూపించారు. ఇప్పటికే టీజర్ 35 మిలియన్ కు చేరుకుంది.
 
Rajasab set
ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ మాట్లాడుతూ - "రాజా సాబ్" సినిమా కోసం మూడున్నరేళ్లుగా పనిచేస్తున్నాం. ఇదొక వండర్ ఫుల్ ఎక్సిపీరియన్స్. ఇప్పటికీ ఈ మూవీ కోసం డిజైన్స్ చేస్తున్నాం. మీరు రాజా సాబ్ హవేలీని, సినిమాకు చేసిన ఇతర ఆర్ట్ వర్క్ ను ఇష్టపడతారు. అన్నారు.
 
Rajasab set
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ - "రాజా సాబ్" సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. "రాజా సాబ్" మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్. ఈ సినిమా కోసం మరే సినిమాకు నిర్మించని బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. వీఎఫ్ఎక్స్, మేకింగ్ గ్రాండియర్ లో థర్డ్ బిగ్గెస్ట్ మూవీ అని చెప్పగలను. "రాజా సాబ్" మొదలుపెట్టినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మీ అంచనాలు అన్నీ అందుకుంటూ మా సినిమా అన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ప్రభాస్ గారు వరల్డ్ సినిమాకు బిగ్గెస్ట్ ఐకాన్. ఆయనతో కలిసి మూవీ చేయడం ఎంతో హ్యాపీగా ఉంది. ప్రభాస్ గారితో ఈ మూవీ గురించి డిస్కస్ చేసినప్పుడు కొన్ని నిమిషాల్లోనే ఓకే చేశారు. మారుతి గారు బెస్ట్ డైరెక్టర్. "రాజా సాబ్" సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటుంది.

Rajasab set
2024లో మా సంస్థ నుంచి వచ్చిన కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఆ లోటును "రాజా సాబ్" సినిమా భర్తీ చేస్తూ అతి పెద్ద విజయాన్ని సాధించబోతోంది. ఈ సినిమా కోసం మారుతి గారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 120 డేస్ కష్టపడ్డారు. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ రాజా సాబ్ మూవీకి హైలైట్ అవుతుంది. ప్రభాస్ గారి లాంటి పెద్ద హీరోకు మ్యాచ్ అయ్యేలా నెగిటివ్ రోల్ కు సంజయ్ దత్ గారిని తీసుకున్నాం. రాజా సాబ్ మూవీకి సీక్వెల్ పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుంది. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్