'మేడ మీద అబ్బాయి'గా వస్తున్న అల్లరి నరేష్ (Teaser)
కామెడీతో కితకితలు పెట్టే అల్లరి నరేష్‌కు గతకొంతకాలంగా సరైన హిట్ కోసం పరితపిస్తున్నాడు. స్పూఫ్ కామెడీతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే ఈ కమెడియన్ ఇపుడు "మేడ మీద అబ్బాయి"గా ప్రేక్షకుల ముందుకు రాను
కామెడీతో కితకితలు పెట్టే అల్లరి నరేష్‌కు గతకొంతకాలంగా సరైన హిట్ కోసం పరితపిస్తున్నాడు. స్పూఫ్ కామెడీతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే ఈ కమెడియన్ ఇపుడు "మేడ మీద అబ్బాయి"గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజాగా "ఒరు వడక్కన్ సెల్ఫీ" అనే మలయాళ సినిమాను ప్రజీత్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'మేడ మీద అబ్బాయి' అనే టైటిల్ పెట్టారు. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రం నరేష్ కెరీర్‌లో 53వది కాగా ఇందులో నిఖిల్ విమల్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షాన్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.