Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'జై' రఫ్ అయితే.. 'లవ' అంత సాఫ్ట్ : జూ.ఎన్టీఆర్ "జై లవ కుశ" టీజర్

యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం జై లవ కుశ. 'పవర్', 'సర్థార్ గబ్బర్ సింగ్' వంటి చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్

Advertiesment
Jai Lava Kusa
, శుక్రవారం, 25 ఆగస్టు 2017 (08:26 IST)
యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం జై లవ కుశ. 'పవర్', 'సర్థార్ గబ్బర్ సింగ్' వంటి చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హీరో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన సెట్స్ షూటింగ్ జరుపుకుంటోంది.
 
ఇప్పటికే రిలీజ్ అయిన జై టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ రావటంతో వినాయక చవితి సందర్భంగా ఈ 24న లవ టీజర్‌ను విడుదల చేశారు. అంతేకాదు నెలాఖరుకల్లా కుశ టీజర్‌ను కూడా రిలీజ్ చేసి ఆడియో రిలీజ్‌కు రెడీ అయ్యే ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 21న రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ సినిమా ఆడియో వేడుకను సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు థియేట్రికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీఖన్నాలు హీరోయిన్లు గా నటిస్తున్నారు.
 
అయితే, ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. 'జై' పాత్రకి సంబంధించిన ఫస్టు లుక్ .. ఫస్టు టీజర్ వచ్చేశాయి. ఈ రెండూ కూడా ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ విషయానికొస్తే వ్యూస్ పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. దాంతో ఇటీవలే 'లవ' పాత్రకి సంబంధించిన ఫస్టు లుక్‌ను వదిలిన టీమ్, ఆ తర్వాత టీజర్‌ను రిలీజ్ చేసింది.
 
'జై' పాత్రకి పూర్తి భిన్నంగా 'లవ' పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. 'జై' ఎంత రఫ్ లుక్ తో కనిపించాడో .. 'లవ' అంత సాఫ్ట్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ రెండు పాత్రల మధ్య  వేరియేషన్ అభిమానులల్లో మరింత ఆసక్తిని పెంచేదిలావుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాఫ్ట్‌గా లవ... 'జై లవకుశ'లో లవ టీజర్(వీడియో)