Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మర్డర్స్ కేసులను పోలీసులు ఎలా సాధిస్తారలో కథతో హైడ్ న్ సిక్

Viswanth, Shilpa Manjunath, Rhea Sachdev

డీవీ

, గురువారం, 5 సెప్టెంబరు 2024 (17:04 IST)
Viswanth, Shilpa Manjunath, Rhea Sachdev
మర్డర్స్ కేసులను పోలీసులు ఎలా సాధిస్తారలో కథతో హైడ్ న్ సిక్ చిత్రం రూపొందింది. విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్ హీరో హీరోయిన్లుగా నటించగా బసిరెడ్డి రానా దర్శకత్వంలో రూపొందింది. నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తిరుపతి ఎస్ఐటీ కాలేజీలో ట్రైలర్ ను విడుదల చేసింది. 
 
ఈ సందర్భంగా నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రం అందరిని అలరించే ఓ సస్పెన్స్ అవుతుందని.. అందరూ కచ్చితంగా సెప్టెంబర్ 13 న థియేటర్లో ఆదరించాలని పేర్కొన్నారు.
 
హీరోయిన్ శిల్పా మంజునాథ్ మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రం విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు అందరిని థ్రిల్ కు గురిచేస్తుందని, ఖచ్చితంగా థియేటర్లో ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
 
హీరోయిన్ రియా సచ్దేవ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 13న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతుందని, అందరూ కచ్చితంగా చూసి ఆదరించాలని కోరారు. ఈ చిత్రం మీ అందరిని కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక కాలేజ్ స్టూడెంట్స్, టీచర్స్, హైడ్ న్ సిక్ మూవీ కాస్ట్ అండ్ క్రూ కి స్పెషల్ థాంక్స్ చెప్పారు.
 
థియేటర్ లో చూసే ప్రేక్షకులను ఆధ్యాంతం కట్టి పడేసే అద్భుతమైన కథతో హైడ్ న్ సిక్ చిత్రం రూపొందిందని.. ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అలరిస్తుందని, సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే ఎన్నో సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని డైరెక్టర్ బస్సు రెడ్డి రానా తెలిపారు. ఈ సందర్భంగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే చిత్ర నటీనటులకు, టెక్నీషియన్స్ కు, నిర్మాతకు శుభాకాంక్షలు చెప్పారు.
 
హీరో విశ్వంత్ మాట్లాడుతూ..   హైడ్ న్ సిక్ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాము అని, ఇలాంటి ఎనర్జీనే ఈ చిత్రానికి అవసరం అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఎక్కడ చూసినా చిత్రం పట్ల చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ఆ వైబ్ తోనే సెప్టెంబర్ 13న థియేటర్లో కలుద్దామని ఈ సందర్భంగా దర్శకుడు బాసిరెడ్డి రానా, నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, అలాగే కాలేజీ మేనేజ్ మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తదనంలేని విజయ్ గోట్ - సమీక్ష