Hari hara.. trailer poster
పవన్ కళ్యాణ్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు నేడు విడుదలైన హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ ట్రైలర్ ఆన్‌లైన్‌లో మరియు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. గురువారం హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో విడుదలైన ఈ ట్రైలర్ అభిమానులు, సినీ ప్రేమికులలో ఉత్సాహాన్ని నింపింది. కోహినూర్ వజ్రం, ఔరంగేజ్ హిందూదేశంపై దాడి తోపాటు.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా రాజకీయ రంగాన్ని పోలిస్తూ పలికే డైలాగ్ లు వున్నాయి.
ట్రైలర్ ను పరిశీలిస్తే..
హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాలకింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రక్రుతి పురుడు పోసుకున్న సమయం. అంటూ వీరమల్లు నేపథ్యాన్ని ఉటంకిస్తూ సాగుతుంది. వెంటనే గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు అంటూ శ్రతువులు అడ్డుకునే విధానం.
సింహాసనమా? మరణశాసనమా? ఈ భూమిమీద వున్నది ఒక్కటే కోహినూర్.. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఎవరది.. ఎవరదీ.. అంటూ నేపథ్యంలో పాట వస్తుంది. వెంటనే హరిహరవీరమల్లు గుర్రంపై ఎక్కుతూ ఎంట్రీ.. ఇప్పటివరకూ మేకల్ని తినే పులిని చూసుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో వపన్
అనంతరం సూర్య, చంద్రుల్ని పోలుస్తూ హరిహరవీరమల్లు కేరెక్టరైజేషన్ వుంటుంది.
నేను రావాలని చాలామంది దేవుళ్ళకు దణ్ణం పెట్టుకుంటుంటారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు.... వినాలి. వీరమల్లు చెప్పింది వినాలి.. అంటూ సైన్యాధ్యక్షుడితో డైలాగ్. బాకులతో, తుపాకులతో పోరాట సన్నివేశాలు హైలైట్ గా అనిపించేట్లా వున్నాయి.
హిందూ దేశంమీద పవిత్రంగా మన జెండా ఎగరాలని ఔరంగజేబ్ పాత్రధారి బాబీ డియోల్ డైలాగ్ తో యాక్షన్ సీన్స్ తో అలరించేలా వున్నాయి.
ఔరంగజేబు హిందూ ధర్మాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్న వారిని ఎదిరించే నిర్భయ యోధుడు వీర మల్లుగా పవన్ కనిపిస్తాడు. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ మొదటి పార్ట్ గా జూలై 24న థియేటర్లలో విడుదలకాబోతోంది. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి, సంగీతం ఉత్తేజకరంగా ఉంది.
ఈ చిత్రంలో నాజర్, సునీల్, తనికెళ్ళభరణి, సత్యరాజ్, పూజిత పొన్నాడ, బాబీ డియోల్ తదితరులు నటించారు. ఎ ఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌లో ఎ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.