Kiran Abbavarapu, Chandini Chaudhary,
యూత్‌ఫుల్ సినిమాల పేరుతో యువతీ యువకులు మందుకొట్టడం, బూతులు మాట్లాడడం, లిప్‌కిస్ చేయడం ఇప్పుడు పరిపాటి అయింది. తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ఇందుకు మినహాయింపు కాదు. కలర్‌ఫొటో సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు తాజాగా సమ్మతమే అనే సినిమాతో రాబోతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను రాష్ట్ర మంత్రి కె.టి.ఆర్. ఆవిష్కరించారు. అందులో మందు కొట్టడం, బూతులు మాట్లాడడం, లిప్‌కిస్‌లు వుండడం విశేషం. తెలంగాణాకుచెందిన గోపీనాథ్ రెడ్డి దర్శకుడు, నిర్మాత కూడా కావడం విశేషం.
అయితే ఇందులో పలు సన్నివేశాలు యూత్‌ను అలరించేవిగా వున్నాయి. హీరోయిన్లు అవకాశాల కోసం కథ నచ్చింది అంటే చాలు దర్శకనిర్మాతలు బోల్డ్‌గా నటించమని అడిగేస్తున్నారు. ఇందులో ఎస్.ఆర్. కళ్యాణ మండపం హీరో కిరన్ అబ్బవరపు హీరో. తను ఈమెను ప్రేమించడం, ఈమె హోటల్‌కు తీసుకెళ్ళడం. బూస్ట్ తాగుతావా! అని హీరోను అడగడం.. నేను కూల్‌డ్రింగ్ తాగుతాననడం.. అదికాదు. బూస్ట్ అంటే మందు కొడతావా! అని అర్థం అంటూ వివరణ ఇవ్వడం.
ఇలా కొత్త కొత్త అర్థాలు, వెండితెరపై ప్రజెంట్‌చేయడంపై ఇదేదో లోకజ్ఞానంలాగా దర్శక నిర్మాతలు యూత్‌పై రుద్దుతున్నట్లు కొందరు విమర్శిస్తున్నారు. సినిమా ఎలా వుంటుందో కానీ, మరలా యూత్ పేరుతో బూతు సినిమాలు వస్తున్నాయనే టాక్ అయితే వచ్చింది. మరి ఇలాంటి సినిమాలు వల్ల కొత్తగా స్వంత డబ్బులతో దర్శకుడిగా మారిన తెలంగాణ దర్శకుడు పరిస్థితి, హీరోహీరోయిన్లు పరిస్థితి మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాల్సిందే.