రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి నటిస్తూ రూపొందించిన చిత్రం 'రాజా వారి చేపల చెరువు'. ఈ సినిమా ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. లక్ష్మీగణపతి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రమణ్యం. బి. రూపేష్. వై. ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రం గురించి పోసాని చెబుతూ, 'ప్రజలను తమ మాటలతో వంచిస్తున్న రాజకీయనాయకుల గురించి, రాజకీయాల గురించి ఈ సినిమాలో చర్చించామన్నారు. అయితే ప్రత్యేకంగా ఒక పార్టీని కానీ, వ్యక్తులను కానీ విమర్శించే విధంగా చిత్రం లేదని పోసాని స్పష్టం చేశారు.
రాజకీయాలలో సేవకులే కానీ నాయకులు ఉండరు, ప్రజలే నాయకులని ఈ సినిమాలో చూపించామని పోసాని తెలిపారు. ఇందులో తాను పోలీస్ ఆఫీసర్‌గా నటించానని చెప్పారు. పోలీస్ ఉద్యోగం నుంచి తొలగించిన తాను చేపల చెరువు పెట్టుకుని మీడియా సహకారంతో అన్యాయాలను ప్రతిఘటించానన్నదే ఈ సినిమా కథని పోసాని వివరించారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో చూడండి.