Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ చిత్రం సౌండ్ పార్టీ రివ్యూ

VJ Sunny, Sivannarayana
, శుక్రవారం, 24 నవంబరు 2023 (16:02 IST)
VJ Sunny, Sivannarayana
నటీనటులు : :వి.జే సన్నీ, హ్రితిక శ్రీనివాస్,  శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు.
 
టెక్నీషియన్స్ :: డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి ;ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ;   పి. ఆర్. ఓ. :  జీ కె మీడియా ; నిర్మాతలు : రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; 
సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ ; రచన - ద‌ర్శ‌కత్వం :  సంజ‌య్ శేరి.విడుదల తేదీ ; 24-11-2023
 
బిగ్ బాస్ ఫేమ్ వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా నటించిన మూవీ సౌండ్ పార్టీ. జయ శంకర్ సమర్పణలో  సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో  తెలుసుకుందాం. 
 
కథ:
పూర్వీకులు రాజులా బతికిన కుటుంబంలో పుట్టిన వారసులు తండ్రి కుబేర్ కుమార్ (శివన్నారాయణ), కొడుకు డాలర్ కుమార్ (వీజే సన్నీ). కష్ట ;పడకుండా కోటీశ్వరులు అవుదామనుకుంటారు. వీరికి అమ్మాయకత్యం, తింగరి తనం ఎక్కువే. వీరి చేష్టలు ఎదుటివాడికి నవ్వు పుట్టిస్తాయి. కష్టపడకుండా సౌండ్ పార్టీ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. 
 
ఇంటి నిండా అప్పులే మిగులుతాయి. అలాంటి టైంలో కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌లకు ఓ ఆఫర్ వస్తుంది. ఎమ్మెల్యే వర ప్రసాద్ (కమెడియన్ పృథ్వీ) కొడుకు చేసిన తప్పుని మీద వేసుకుని జైలుకు వెళ్లేందుకు సిద్ధపడతారు. అలా చేయడం వలన వారికి రెండు కోట్లు వస్తాయి. ఆ రెండు కోట్ల కోసం కనీసం ఆ తప్పు ఏంటో కూడా తెలుసుకోకుండా చేయని తప్పుకు ఉరి శిక్ష పడుతుంది.  ఆ తరువాత ఏం జరిగింది? అన్నది మిగతా కథ.
 
సమీక్ష;
 
తాతలు మీసాలకు సంపెంగ నూనె రాసేవారు. ఇప్పటి తరం కూడా అలానే ఉండాలనే రకం ఉంటె ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథ.. ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ యాం కింగ్  అనే రాజేంద్ర ప్రసాద్ సినీమా లాంటి కథలు చూసాము. కానీ సౌండ్ పార్టీ సరికొత్తగా అనిపిస్తుంది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన సన్నీ, శివన్నారాయణ తండ్రి కొడుకులుగా ప్రేక్షకుల్ని మెప్పిస్తారు. ఫాదర్‌ అండ్ సన్‌ కెమిస్ట్రీ బాగా కుదిరింది. 
 
ఇక సిరి పాత్రలో హ్రితిక నటనతో పాటు లుక్స్ తో ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో ఓ కీలక సన్నివేశంలో తానే ముందుండి నడిపిస్తుంది. ఇక సన్నీ తల్లి పాత్రలో ప్రియ నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. జైలర్ గా సప్తగిరి అదరగొట్టాడు. ఎమ్మెల్యే వరప్రసాద్‌గా పృథ్వీ మెప్పించారు. శాస్త్రవేత్తగా అలీ ఒకటి రెండు సీన్లలో కనిపించినా.. తనదైన ఫన్నీ యాక్టింగ్ తో నవ్వులు తెప్పించారు. నటులు అశోక్ కుమార్, జెమినీ సురేష్...  సన్నీ మామయ్యలుగా కామెడీని పండించారు. భువన్ కీలకపాత్రలో కనిపించగా, చలాకీ చంటి, అంజలి మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు నటించారు. 
 
సినిమా మొత్తం వినోదంగా మలిచారు. వెన్నల కిశోరె వాయిస్ ఓవర్ బాగుంది. పాత్రధారులు అంతా తమదైన హాస్యం తో ఆడియన్స్ కు నవ్వులు తెప్పించారు. ఈజీగా డబ్బులు సంపాదించడానికి తండ్రి కొడుకులు చేసిన ప్రయత్నాలతో ఫన్ జనరేట్ చేశారు. సెకండ్ హాఫ్ లోను ఆ  నవ్వులు కంటిన్యూ చేసేలా సీన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. ముఖ్యం గా తండ్రీకొడుకులు జైలు నుంచి తప్పించుకునే సన్నివేశాలు, ఆర్.ఆర్.ఆర్. సినిమా స్పూఫ్, బిట్ కాయిన్స్ సీన్స్.. ఇలా అన్ని ఫుల్ గా నవ్వుని తెప్పిస్తాయి. ఈ సీన్స్ లో డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.  ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ తో ఒక సాంగ్, సెకండ్ హాఫ్ లో డబ్బు గురించి వచ్చే సాంగ్ లు రెండూ .. ఆకట్టుకుంటాయి. 
 
మోహిత్ రెహమానిక్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పూర్ణ చారి రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ రెడ్డి అందించిన విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎడిటర్ అవినాష్.. ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టించకుండా సినిమాకు న్యాయం చేశారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒకప్పడు రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్ సినిమాల ఫార్మేట్ లో ఈ సినిమా ఉంది. చిన్నపాటి లోపలున్న సన్నీ నటన బాగుంది. ఎక్కడా డబల్ మీనింగ్ మాటలు, ఎక్సపోసింగ్ వంటివి లేకుండా కుటుంబం తో హాయిగా చూసేసినిమా. 
రేటింగ్ :  3.5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

NBK 109లో బాబీ డియోల్.. గౌతమ్ మీనన్‌లు కూడా వుంటారా?