Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవర్‌ఫుల్ పాత్రలో కార్తీ... 'కాష్మోరా'గా అదరగొట్టేశాడు... రివ్యూ రిపోర్ట్

కార్తీ కాష్మోరా నటీనటులు : కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్‌, తదితరులు సాంకేతిక సిబ్బంది - సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌, డా

పవర్‌ఫుల్ పాత్రలో కార్తీ... 'కాష్మోరా'గా అదరగొట్టేశాడు... రివ్యూ రిపోర్ట్
, శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:33 IST)
కార్తీ కాష్మోరా నటీనటులు : కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్‌, తదితరులు 
 
సాంకేతిక సిబ్బంది - సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌, డాన్స్‌: రాజు సుందరం, బంద, సతీష్‌, కాస్ట్యూమ్స్‌: నిఖార్‌ ధావన్‌, ఫైట్స్‌: అన్‌బారివ్‌, ప్రోస్తెటిక్స్‌: రోషన్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె, నిర్మాతలు: పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్‌.
 
కార్తీ చిత్రమైన గెటప్‌తో 'కాష్మోరా' అనే టైటిల్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీని అటువైపు చూసేలా చేశాడు. భిన్నమైన పాత్రలు పోషించే కార్తీ నుంచి మరో కొత్త ప్రయోగం వస్తుందని చెప్పేశాడు. అందులో వార్‌ సన్నివేశాలుండటంతో బాహుబలి టీమ్‌ పనిచేయడం... బాహుబలి.. మగధీర లాంటి ఎపిసోడ్స్‌ కూడా వున్నాయని ప్రమోషన్‌లో చెప్పడంతో.. ఇంకాస్త క్రేజ్‌ వచ్చింది. హారర్‌ పాయింట్‌ అని అడిగితే.. సోషియో ఫాంటసీ అని చెప్పిన చిత్ర యూనిట్‌.. టైటిల్‌లోనే ఏదో దుష్టశక్తులకు సంబంధించిన కథగా ఫిక్స్‌ అయ్యేలా చేసింది. గతంలో యండమూరి వీరేంద్రనాథ్‌ నవల నుంచి వచ్చిన సినిమాకూ దీనికి ఏమాత్రం పోలిక లేకుండా ఎలా తీశాడో చూద్దాం.
 
కథ :
దెయ్యాలున్నాయని.. నమ్మే వారిని సొమ్ము చేసుకుంటారు కాష్మోరా(కార్తీ) ఫ్యామిలీ. తండ్రి వివేక్‌ జగదాంబ బాబాగా.. ఆయన భార్య, తల్లి, కుమార్తె.. ఇలా ఐదుగురు కలిసి ప్లాన్‌ ప్రకారం ప్రజల్ని మోసం చేస్తుంటారు. ఓ మంత్రి కూడా వీరికి చిక్కుతాడు. నమ్మి దాచమని ఇచ్చిన సొమ్ముతో కాష్మోరా ఫ్యామిలీ వుడాయిస్తుంది. ఆ సమయంలో కాష్మోరా ఓ ఊరి రాజభవంలో ఆత్మలున్నాయని వాటిని కంట్రోల్‌ చేయడానికి వేరే ఊరికి వెళతాడు. అలా వెళ్ళిన వ్యక్తి నిజమైన ఆత్మల చేత చిక్కుకుంటాడు. ఆ క్రమంలో ఓ తాళపత్ర గంథాన్ని చదువుతాడు. ఫ్లాష్‌బ్యాక్‌... 700 ఏళ్ళనాడు.. విక్రంతక సామ్రాజ్యం అది. రాజు దగ్గర శేనాధిపతి రాజ్‌ నాయక్‌(కార్తీ). 
యుద్ధం చేస్తే శత్రువు పారిపోవాల్సిందే. అలా రాజుకు రాజ్యాలను కట్టపెడతాడు. అలాంటి రాజ్‌ నాయక్‌ స్త్రీ లోలుడు. రాజు కుమార్తె రత్నమహాదేవి(నయనతార)ను వశం చేసుకునే క్రమంలో అందరినీ చంపేస్తాడు. బలవంతంగా పెండ్లి చేసుకొనే రోజు విషం ఇచ్చి నాయక్‌ను చంపేస్తుంది. అతను అత్మ రూపంలో ఇలా ఈ భవంతిలో వున్నాడు. అది పైలోకాలకు వెళ్ళాంటే.. రోహిణి నక్షత్రంలో పుట్టిన ఐదుగురు బలికావాలి. ఇది చదివిన కాష్మోరాకు.. అసలు విషయం బోధపడుతుంది. తన కుటుంబం చస్తేగానీ.. నాయక్‌ పైలోకాలకు వెళ్ళడు. ఈ సందిగ్థంలో తనేం చేశాడు? అనంతరం పరిణామాలు ఎలా వున్నాయి? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌:
కార్తీ నటుడిగా పలు భిన్నమైన పాత్రలు పోషించాడు. కానీ ఇందులో కాష్మోరాగా... రాజ్‌నాయక్‌గా ఆయన చేసిన పాత్ర చాలా భిన్నమైంది. ఆత్మ తనపైకి ప్రవేశిస్తే ఎలా భయపడతాడో.. సెకండాఫ్‌లో అద్భుతంగా నటించాడు. రాజ్‌నాయక్‌ పాత్ర చిత్రానికి హైలైట్‌. నయనతార పాత్ర రాణిగా ఓకే. శ్రీదివ్య పాత్ర కాష్మోరా గురించి పరిశోధన చేసే విద్యార్థినిగా నటించింది. వివేక్‌ కార్తీ తండ్రిగా అలరించాడు. ఇక మిగిలినవారంతా తమిళ నటులే కావడం.. కథ ప్రకారం బాగా సూటయ్యారు.
 
టెక్నికల్‌గా...
వర్తమానం నుంచి 700 ఏళ్ళవరకు సాగే కథనంలో కన్పించే చిత్రమైన మలుపులన్నీ.. గ్రాఫిక్స్‌,, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఆట్టుకున్నాయి. నాయక్‌ పాత్ర మొండెం మాత్రమే కన్పించడం. ఆ తర్వాత.. కలిసిపోవడం.. వంటివి హాలీవుడ్‌ చిత్రాల్లో చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు కీలకం. యాక్షన్‌ ఎపిసోడ్స్‌.. యుద్ధాలు... బాహుబలి.. మగధీర చిత్రాలను గుర్తు చేస్తాయి. ఎడిటింగ్‌లో కొన్ని లోపాలున్నాయి. నారాయణ సంగీతం పర్వాలేదు. సీరియస్‌ మూవీ కాబట్టి.. పాటలు పెద్దగా ప్రాధాన్యత లేదు.
 
విశ్లేషణ:
ఓ కల్పిత కథను తీసుకుని.. దానికి ఆత్మలు, దెయ్యాలు.. అని జోడించి.. బోర్‌ లేకుండా చూపించడం సాహసమే. ఈ సినిమాలో దర్శకుడు గోకుల్‌ సక్సెస్‌ అయ్యాడు. హార్రర్‌ ఎపిసోడ్స్‌లోనూ కార్తీతో పాటు ఫ్యామిలీ చేసే విన్యాసాలు నవ్వు పుట్టిస్తాయి. పిల్లలు కూడా భయపడుతూ ఆనందించేట్లుగా వున్నాయి. ప్రజలు, పోలీసులు, రాజకీయ నాయకులు దొంగ బాబాను ఆశ్రయించే విధానం ఎంటర్‌టైన్‌ చేయిస్తుంది. మొదటిభాగం ఎంత సరదాగా సాగిందో.. రెండో భాగం సినిమాకు కీలకం. సీరయస్‌ అంశమైనా బోర్‌ లేకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. నయనతార డైలాగులు, పెర్‌ఫార్మెన్స్‌.. మగధీర.. మిత్రవిందను గుర్తు చేస్తాయి. 
 
వర్తమానం.. గతం చూపించే కథ కాబట్టి.. గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్‌ పనితనం బాగుంది. సినిమాలో అదే కీలకం. నిడివి కూడా 2 గంటల 40 నిముషాల వున్నా పెద్దగా లాగ్‌ అన్పించదు. కానీ కొన్ని సీన్లు ఎందుకు వస్తాయో అర్థంకాదు. డబ్బింగ్‌ సినిమా కాబట్టి.. తమిళ ఆర్టిస్టులు ఎక్కువగా వుండటంతో.. తెలుగు ఆడియన్‌ కనెక్ట్‌ కావడానికి కాస్త టైమ్‌ పడుతుంది. అయితే.. ఆత్మలు, ప్రేతాత్మలు వంటి ఫార్మెట్‌ను ఇంతకుముందు సూర్య 'రాక్షసుడు' పేరుతో తెలుగులో వచ్చింది. అది అర్థంకాకపోవడంతో డిజాస్ట్‌ర్‌ సినిమాగా మిగిలింది. అయితే.. కాష్మోరా మాత్రం అందుకు విరుద్ధం. కాన్సెప్ట్‌ హార్రర్‌ అయినా.. దాన్ని వర్తమానంలోకి జొప్పించి.. తీయడం ప్రత్యేకత సంతరించుకుంది. హారర్‌ కామెడీ చిత్రాలు చూసేవారికి బాగా నచ్చుతుంది. టైంపాస్‌ సినిమాగా చూడవచ్చు. ఎబో ఏవరేజ్‌ చిత్రంగా చెప్పవచ్చు.
 
రేటింగ్‌: 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాణిశ్రీకి నచ్చిన నేటి హీరోలు ఎవరో తెలుసా? ఆ ముగ్గురే..? త్రివిక్రమ్ సినిమాలంటే?