Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'జాక్‌పాట్‌' రివ్యూ రిపోర్ట్

'జాక్‌పాట్‌' రివ్యూ రిపోర్ట్
, శనివారం, 23 నవంబరు 2019 (10:29 IST)
నటీనటులు: జ్యోతిక, రేవతి, రాజేంద్రన్‌ యోగిబాబు, ఆనంద్‌ రాజ్‌ తదితరులు.
సాంకేతికవర్గం: సినిమాటోగ్రఫర్‌ : ఆనంద కుమార్‌,
సంగీతం:  విశాల్‌చంద్రశేఖర్‌, 
నిర్మాత: సూర్య, 
దర్శకత్వం: కళ్యాణ్‌
 
జ్యోతిక, రేవతి, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జాక్‌ పాట్‌'. మూడునెలలక్రితమే తమిళనాడు విడుదలైంది. స్వంత బేనర్‌లో సూర్య నిర్మించిన చిత్రమిది. ఆనంద్‌ రాజ్‌, కమెడియన్‌ యోగి బాబు నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్‌ దర్శకత్వం వహించగా, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. 
 
 కథ :
అక్షయ (జ్యోతిక) అనాథ. మాషా (రేవతి) చిన్నప్పుడే అక్షయను చేరదీస్తోంది. వారిద్దరూ తమ తెలివితేటల్తో ప్రజల్ని మోసం చేస్తుంటారు. చివరికి ఓ కేసులో జైలుకు వెళతారు. అక్కడ ఓ ముదుసలి చెప్పిన సమాచారం మేరకు ఓ రాజకీయనాయకుడి ఇంటి పెరట్లో వున్న దాగివున్న అక్షయపాత్రను తస్కరించాలను చూస్తారు. అది ఎక్కడుందో కనిపెట్టి తీయాలనుకున్న టైంలో కొన్ని సమస్యలు వచ్చిపడాతాయి. చివరికి దాన్ని సాధించారా!లేదా! అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
పురాణాల్లో అక్షయపాత్ర గురించి విన్నాం. అది ఇప్పట్లో దొరికితే దాని పరిణామాలు ఏమిటి! అనేవి పూర్తి వినోదాత్మకంగా చూపించారు. సహజంగా హీరోలు చేసిన సినిమాను జ్యోతిక, మాషాలు హీరోలుగా చేసి చూపించారు. వారుచేసే పనులు, మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా పిల్లలకు బాగా కనెక్ట్‌ అవుతాయి. తెలుగులో అల్లరినరేశ్‌ చిత్రానికి ఏమాత్రం తీసిపోనివిధంగా ఈ చిత్రం వుంది. 
 
ఇందులో ఇద్దరు లేడీస్‌ నటించారన్న కాన్సెప్ట్‌కంటే వారు చేసే విన్యాసాలే ఎంటర్‌టైన్‌ చేస్తాయి.  ఆనంద్‌రాజ్‌ అతని గ్యాంగ్‌ చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి. పైగా తను అమ్మాయిగా మరో పాత్రలో నటించడం కొసమెరుపు. జ్యోతిక తన టెర్రిఫిక్‌ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారు.

ఆమె అగ్రెసీవ్‌ బాడీ లాంగ్వేజ్‌, డామినేట్‌ చేసే ఆమె మాడ్యులేషన్‌ ఆమె పాత్రకు ఫర్ఫెక్ట్‌గా సరిపోయాయి. రేవతి కూడా అగ్రెసీవ్‌ పెర్ఫార్మెన్స్‌తో కొత్తగా కనిపిచింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు అలరిస్తాయి. ఓ అమాయకపు సిన్సియర్‌ లవర్‌గా రాజేంద్రన్‌, యోగిబాబు తమ నటనతో ఆకట్టుకుంటూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌లా నిలిచారు.
 
ఇప్పుడు వస్తున్న రొటీన్‌ సినిమాలకు కాస్త భిన్నంగానూ ఓ సందేశాన్ని ఇచ్చే చిత్రంగా మలచడం విశేషం. సినిమా మెయిన్‌గా మాస్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యే జోనర్‌ అయినప్పటికీ దర్శకుడు మాత్రం అక్కడక్కడ ఆకట్టుకున్నే కామెడీ సన్నివేశాలు తప్ప, మిగిలిన భాగం అంతా సింపుల్‌గానే నడిపించారు. బతుకులను మార్చే అక్షయ పాత్రను వెతికే క్రమం పెరిగే కొద్ది.. స్క్రీన్‌ ప్లే చాలా ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉండాలి. 
 
కానీ ఈ చిత్రంలో చాలా తేలికపాటి సీన్స్‌తోనే ముగించడం అంతగా రుచించదు. సినిమాలో సప్సెన్స్‌ ఇంట్రస్ట్‌ పెంచే స్కోప్‌ ఉన్నప్పటికీ కళ్యాణ్‌ మాత్రం సెకెండ్‌హాఫ్‌ని సింపుల్‌ గా హ్యాండల్‌ చేశారు. అక్షయపాత్ర వస్తే పేదవారనేవారు లేకుండా చేయవచ్చనే కల్పిత కథతో మరల్చడం ఈ చిత్రంలోని ప్రత్యేకత. ఇప్పటికే సూర్య తన సేవాకార్యక్రమాలతో తమిలనాడులో ప్రజలకు దగ్గరయ్యాడు. 
 
అయితే ఎంతమందికి సాయం చేసినా ఇంకా చేయాల్సింది చాలానే వుంటుంది. అందుకే అక్షయపాత్ర లాంటిది వస్తే సమస్య సాల్వ్‌ అవుతుందనే విధంగా కథను రాసుకున్నట్లుంది. ఏదిఏమైనా థియేటర్‌లో హాయిగా కాసేపు నవ్వుకునేట్లుగా వుంది. మ్యూజిక్‌ విశాల్‌ చంద్రశేఖర్‌ పర్వాలేదనిపించాడు. నేపధ్య సంగీతం అక్కడక్కడ పర్వాలేదనిపిస్తోంది. సినిమాటోగ్రఫర్‌ ఆనందకుమార్‌ కెమెరా పనితనం బాగుంది. సినిమా మూడ్‌కి అనుగుణంగా అయన దృశ్యాలని తెరకెక్కించారు. ముఖ్యంగా కామెడీ బి.సి సెంటర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
 
రేటింగ్‌: 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు పెళ్ళయిన ఆడవాళ్ళంటేనే వల్లమాలినంత ఇష్టం