Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లింగొచ్చా ప్రేమ కథ ఎలా వుందంటే! రివ్యూ

Karthik Ratnam, Suparna Singh
, శనివారం, 28 అక్టోబరు 2023 (10:48 IST)
Karthik Ratnam, Suparna Singh
శివ (కార్తీక్‌ రత్నం) హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో బార్బర్‌ కుటుంబానికి చెందినవాడు. తండ్రి షాప్‌లో పనిచేస్తుంటే శివ పెద్దగా ఆసక్తి చూపడు. చిన్నతనంలోనే స్నేహితులతో ఏడుపెంకులాట (లింగోచ్చా) ఆడుతుండగా నూర్జహ (సుప్యర్ణ సింగ్‌)ను చూడగానే ప్రేమించేస్తాడు. ఆ తర్వాత నూర్జహ తల్లిదండ్రులు దుబాయ్‌ వెళ్ళిపోతారు. డాక్టర్‌ కోర్సు చదువుకుని తిరిగి నూర్జహ హైదరాబాద్‌ వస్తుంది. అప్పటినుంచి తనకోసమే వచ్చినట్లుగా భావించి ఆమెను మరింత ప్రేమిస్తాడు. అయితే ఆమె తల్లిదండ్రులకు వీరి ప్రేమ నచ్చదు. తక్కువ కులం వాడివని హేలన చేస్తారు. దాంతో ప్రేమికులు ఇద్దరూ దుబాయ్‌ చెక్కేయాలని ప్లాన్‌ చేస్తారు. ఆ తర్వాత ఏమయింది? చివరికి వీరి ప్రేమ ఆనందమా? విషాదమా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
 
సమీక్ష్‌
ఈ చిత్ర కథ హిందూ, ముస్లిం ప్రేమకథ. ఈ తరహా కథలు ఇంతకు ముందు చాలానే వచ్చాయి. అయితే ఇందులో ఓల్డ్‌ సిటీ నేపథ్యంతోపాటు స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తం చేయడంలో హీరో హీరోయిన్లు బాగా హావభావాలు పలికించారు. నేటివిటీ తగినట్లు పాత్రల చిత్రీకరణ వుంది. ఈ సినిమా సంగీతం ప్రధాన ఆకర్షణ. మూడ్‌ను క్రియేట్‌ చేసి ప్రేక్షకుల్ని అలరించింది. మొదటి భాగం సో.సో..గా అనిపించినా సెకండాఫ్‌ నుంచి కథ రక్తికట్టింది. క్లయిమాక్స్‌ ఆలోచింపజేస్తుంది. అయితే కమేడియన్స్‌ తన పరిధిమేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ కొన్నిచోట్ల ఎక్కువ అయినట్లుగా వుంది.
 
చిత్ర దర్శకుడు ఆనంద్ బడా తను ఎంచుకున్న కథ, నేపథ్యం కొత్తగా వుంది. తమిళనాడులో ఇలాంటి నేపథ్యాలకు ఆదరణ వుంది. ప్రేమికుల కథను చెప్పే విధానం సక్సెస్‌ అయ్యాడు.  నటీనటుల నుంచి నటన రాబట్టుకున్నాడు. మ్యూజిక్ బికాజ్ రాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. కెమెరామెన్ చాలా బాగా చేసాడు.. హైదరాబాద్ పాతబస్తి లొ లొకేషన్స్ ని అందంగా చూపించాడు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తాయి..మిగతా టెక్నిషియన్స్ అందరూ వారి వారి పరిదిలో బాగా చేసారు.
 
కార్తిక్ రత్నం ధియోటర్ ఆర్టిస్ట్ కావడం వలన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అతని సింగిల్ హ్యాండ్ లో కథ ని తీసుకెళ్ళాడు. హీరోయిన్ సుప్యర్థ సింగి ముద్దుగా అందర్ని ఆకట్టుకుంది. నటన, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా పలికించింది. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ లు స్టోరి నేరేటర్స్ గా మెప్పించారు. మిగతా పాత్రలన్ని వాటి పరిధిలో మెప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాది నవాబ్స్, అంగ్రేజ్ లాంటి చిత్రాలతో లోకల్ లో సంచలన విజయాలు సాధించిన చాలా సంవత్సరాలు తరువాత లొకల్ గా లింగోచ్చా వచ్చింది. యూత్ చూసే చిత్రమిది.
రేటింగ్: 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్ల క్యారెక్టర్‌పై కామెంట్లా.. ఎంత మందితో పడుకుందని..?