నటీనటులు: వరుణ్ తేజ్-సాక్షి వైద్య-నాజర్-వినయ్ రాయ్-విమలా రామన్-నరేన్-రోషిణి ప్రకాష్-మనీష్ చౌదరి-అభినవ్ గోమఠం-రవి వర్మ తదితరులు
సాంకేతికత: సంగీతం: మిక్కీ జే మేయర్ ఛాయాగ్రహణం: ముకేష్.జి నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ రచన-దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.
గాండీవధారి అర్జున' మూవీ తో కథానాయకుడు వరుణ్ తేజ్ ప్రపంచ పర్యావరణ సమస్యను చాటిచెప్పానని ప్రకటించాడు. జి-7 దేశాల సమిట్ లో ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య అది. ఇందులో గార్డ్ (సెక్యూరిటీ ఏజెంట్.)గా చేసాడు. ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. ఈరోజు విడుదలైన సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ
భారతదేశంలోని ఈస్ట్ కోస్ట్ పోర్ట్‌లో రవి వర్మతో సినిమా ప్రారంభమవుతుంది. తరువాత, అది UKకి మారుతుంది. అర్జున్ (వరుణ్ తేజ్) ఒక సెక్యూరిటీ ఏజెంట్. కాంట్రాక్టు మీద యూకేలో సెక్యూరిటీ సర్వీస్ అందిస్తుంటాడు. నాజర్ భారతదేశం నుండి ఉన్నత స్థాయి మంత్రి. ప్రపంచ దేశాలు కొన్ని ఇండియాను చెత్త వేయడానికి ఉపయోగిస్తారు. ఆ విషయంపై లండన్ మీటింగ్ కు వెళ్తాడు నాజర్. అక్కడ నాజర్ కుమార్త్ కిడ్నాప్ కు గురవుతుంది. . ఎవరు ఇది ప్లాన్ చేశారు? మరి అర్జున్ ఏమిచేసాడు. సాక్షి పాత్ర ఏమిటి? తర్వాత ఏమి జరిగింది? అనేది మిగిలిన కథ.
సమీక్ష:
గాందీవధారి అర్జున చెప్పటానికి చిన్న పాయింట్. కానీ కధనం చాలా పెద్దది. హీరోనే కథ చెప్పేటప్పుడే రెండు గంటలు విన్నాడట. అంత స్టైలిష్ గా కదా చెప్పాడు. మొదటి సగం నెమ్మదిగా సాగుతుంది. చాలా చోట్ల రొటీన్‌గా ఉంటుంది, విరామం తర్వాత రెండవ సగం లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ప్రేక్షకులు ఆసక్తిని కనబరచాలంటే సినిమా సెకండాఫ్ గణనీయంగా మారాలి. కానీ విచారకరంగా, రెండవ సగం చాలా పేలవంగా ఉంది. ఓ దశలో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమాలో అప్పుడప్పుడూ ఫ్లాష్‌బ్యాక్‌లు వింటూ అక్షరాలా ఫిదా అయిపోతాం. ప్రతి ఒక్కరూ ఫ్లాష్‌బ్యాక్‌ని వివరిస్తారు దాంతో కొంత నిజంగా చికాకు కలిగిస్తుంది.
పాజిటివ్ విషయానికొస్తే, నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ BGM పర్వాలేదు. డైలాగ్స్ మరింతగా ఆకట్టుకునేలా చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు హైలెట్.
'వాన' ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా ఆకట్టుకున్నాడు. స్టైలిష్ గా కనిపిస్తూనే.. ప్రేక్షకులను భయపెట్టేలా విలనీని పండించడం అతడి ప్రత్యేకత. అలాంటి విలన్ని ఢీకొట్టే హీరో పాత్ర ఎంత హైలెట్ కావలి. . 'సింగం-3'లో సూర్య అందుకు నిదర్శనం. అందులో టచ్ చేసిన గార్బేజ్ డంపింగ్ చుట్టూ కథను అల్లుకోవాలన్న ఉద్దేశం మంచిదే కానీ.. అంతకుమించి ఈ సినిమాలో ఎగ్జైట్ చేసే అంశాలేమీ లేవు. పేరుకే 'గాండీవధారి అర్జున' కానీ. థ్రిల్ లేకపోవడం నిరాశ. తనపై అంచనాలు లేనపుడు 'గరుడవేగ' లాంటి ఆసక్తికర థ్రిల్లర్ సినిమా తీసి ఆశ్చర్యపరిచిన ప్రవీణ్ సత్తారు.. అంచనాలు పెరిగాక 'ది ఘోస్ట్'తో ఎంతగా నిరాశపరిచాడో తెలిసిందే. ఇప్పుడు 'గాండీవధారి అర్జున' చూశాక 'ది ఘోస్ట్' ఎంతో నయం అనిపిస్తుంది. టెక్నాలజీ ఉచ్చులో చిక్కితే ఎంత ప్రమాదమో ఉత్కంఠభరితంగా చూపించారు. ఇంటర్వెల్ విలన్ ఎంట్రీ దగ్గర 'కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. హీరో ఒక గమ్యం లేనట్లు ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. హీరో-విలన్ మధ్య ఫైట్ లేకుండా అవసరం లేని ఎపిసోడ్లతో ద్వితీయార్ధాన్ని నింపేశాడు దర్శకుడు. అసలు కథలో ట్విస్ట్ లు లేవు. పతాక సన్నివేశాలు కూడా సినిమాను నిలబెట్టలేకపోయాయి. విదేశీ సినిమాల ప్రభావం ప్రవీణ్ కు ఉంది. దాన్ని సరిగా చూపలేకపోయాడు.
ఓవరాల్‌గా, కొంచెం కూడా ఆకట్టుకునే డ్రామా లేదా థ్రిల్లింగ్ యాక్షన్ లేకుండా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు నిరాశపరిచాడు. చిత్రనిర్మాత స్టైలిష్ యాక్షన్ సినిమా తీసాడు. ఒక సామాజిక సమస్యను పరిష్కరించడం మధ్య సమతుల్యతను సాధించడంలో విఫలమయ్యాడు, ఇది కత్తిమీద సాము లాంటిదే.