Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మగధీర'కు మరో మెట్టు 'బాహుబలి'... రానా విలనిజమ్ హైలెట్... రివ్యూ రిపోర్ట్

'మగధీర'కు మరో మెట్టు 'బాహుబలి'... రానా విలనిజమ్ హైలెట్... రివ్యూ రిపోర్ట్
, శనివారం, 11 జులై 2015 (13:52 IST)
బాహుబలి నటీనటులు: ప్రభాస్‌, అనుష్క, తమన్నా, నాజర్‌, అడవి శేషు, ప్రభాకర్‌, సత్యరాజ్‌, రోహిణి తదితరులు; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజమౌళి, నిర్మాత: యార్లగడ్డ శోభు.
 
పాయింట్‌: రాజ్య పదవి కోసం అన్నదమ్ముల మధ్య పోరు.
 
బాహుబలి.. అంటూ గత కొంతకాలంగా సినీప్రియుల్లోనూ, ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన సినిమా రాజమౌళి.. పేరుతో వాణిజ్యపరంగా పెద్ద రేంజ్‌లోకి వెళ్ళింది. రెండున్నరేళ్ళ కష్టం. ఈ చిత్రంలో అగుపిస్తుంది. హైటెక్నికల్‌ విలువలు, భారీ సెట్టింగ్‌లతో విజువల్‌ ఎఫెక్ట్స్‌తో మైమరిపించాడు. అయితే ఇందులో భళ్ళాలదేవుడుగా రానా పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ నటీనటులు నటించడం ఒక ఎత్తయితే... హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ కూడా పనిచేయడం విశేషం. రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాలో ఏముందో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే....
మాహిష్మతి రాజ్యంలో శివగామిని భటులు వెంటాడుతుంటే తప్పించుకుని చేతిలో ఓ శిశువుని పట్టుకుని ఎదురుగా వున్న నీటిలో మునిగిపోతూ.. తను చేసిన పాపాలకు తనను బలితీసుకోమని చెప్పి... శివుడ్ని వేడుకుంటుంది. అలా శిశివు బతికి ఆ ప్రాంతంలో వున్న కొండ ప్రాంతంవారికి దొరుకుతాడు. ఆ ప్రాంతం రాణి రోహిణి, శివుడి పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తుంది.  చిన్నతనం నుంచి కొండ అవతల ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో పెద్దవాడైన తర్వాత నానాకష్టాలు పడి అక్కడికి శివుడు (ప్రభాస్‌) చేరుకుంటాడు. అక్కడ అవంతిక(తమన్నా)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను కలిశాక.. ఆ రాజ్యంలో బందీగా వున్న దేవసేన(అనుష్క)ను విడిపించాలన్నదే తన ధ్యేయమని చెబుతుంది. అది తన బాధ్యతగా స్వీకరించి శివుడు ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అందరినీ ఎదిరించి.. దేవయానిని కాపాడతాడు. 
ఆ తర్వాత అందరూ తనను చూసి బాహుబలి అంటూ దేవుడిలా భావిస్తారు. అప్పుడు నేనెవర్ని అంటూ అక్కడివారిని అడుగుతాడు. అది ఫ్లాష్‌బ్యాక్‌. అమరేంద్ర బాహుబలి (ప్రభాస్‌), భళ్లాలదేవ (రానా) పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు. రానా తండ్రికి తన కొడుకు భళ్లాలదేవను రాజును చేయాలనేది కోరిక. దానికి మరో రాణి అయిన రమ్యకృష్ణ, దేశాన్ని ఎవరు కాపడతారో వారే రాజుగా ప్రకటిస్తానని చెబుతుంది. అదే టైంలో కాళకేయుడు అనే రాక్షసజాతికి చెందిన వర్గం వచ్చి రాజ్యంపై దండయాత్ర చేస్తుంది. ఆ సమయంలో యుద్ధవ్యూహంతో ఇద్దరు రాజ్యాన్ని ఎలా కాపాడారన్నది ముగింపు. మరి రాజ్యాన్ని కాపాడాక.. కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి ఏమిటనేది రెండవ భాగంలో 2016 అంటూ ముగింపు ఇస్తాడు.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
కొండ ప్రాంత వాతావరణంలో పెరిగిన శివుడు పాత్రకు ప్రభాస్‌ సరిపోయాడు. కొండలు, కోనల్లో సాహసాలు, యుద్ధ నైపుణ్యం నేర్చుకుంటాడు. చాలా రిస్కీ షాట్స్‌ చేసినా టెక్నికల్‌ మాయలో కొట్టుకుపోతుంది. ఇక రెండో పాత్ర అమరేంద్ర బాహుబలిగా సెకండాఫ్‌లో వచ్చేది సీరియస్‌ పాత్ర. అందుకు కండలు తిరిగిన శరీరంతోపాటు ఫైట్లు కూడా చేయాలి. రాక్షసుడు లాంటి కాళకేయుడుతో ఫైట్స్‌ చేసే సన్నివేశంలో చూపిన ఆవేశం పాత్రకు సరిపోయింది. వీరత్వం బాగా చూపాడు.
 
భళ్లాల దేవునిగా రానా.. కండల విషయంలో ఎక్కువే కసరత్తు చేశాడు. విలనిజంలో కొత్తదనంగా చూపాడు. తను ఈ పాత్రకు కొత్తగా వుండటంతో చూసేవాడికి వినూత్నంగా కన్పించింది. ఇక అవంతికగా తమన్నా పాత్ర ఒకవైపు పోరాటం చేసే యువతిగా, మరోవైపు ప్రేయసిగా మెప్పించింది. ఇక దేవయానిగా అనుష్క పాత్ర కొద్దిసేపయినా... తల్లి పాత్ర ఆమెది. పాతికేళ్ళ సంకెళ్ళ నిర్బంధంలో ఓ గదిలో కట్టిపడేసిన విధానంలో చూపించిన మేకప్‌ ఆ పాత్రకు సరిపోయాయి.

శివగామిగా రమ్యకృష్ణ నటన ఆమెకు కొట్టిన పిండి. మంచిగా వుంటూనే నెగెటివ్‌ చూపించే పాత్ర ఆమెదైనా.. కానీ నెగెటివ్‌ పాత్ర ఇంకా.. మొదటి భాగంలో చూపించలేదు. ఉన్నంతలో బాగా నటించింది. రౌద్రంలో కట్టిపడేసింది. ఇక రాజుకు బానిసగా వుంటూ నమ్మినబంటుగా వుండే పాత్ర కట్టప్పగా సత్యరాజ్‌ పోషించాడు. వయస్సు పైబడినా చేసే పోరాటాలు బాగా చేశాడు. కాలకేయగా ప్రభాకర్‌ చేసిన ఆటవిక క్రూరత్వం కొత్తగా అనిపిస్తుంది. కులు బాషను మార్చి కిలిపి భాష పేరుతో డైలాగ్స్‌ ఆసక్తి కల్గించాయి. ఇక వీరుకా... అస్లాంఖాన్‌ పాత్రలో సుదీప్‌ నటించాడు. మిగిలిన వారు ఆయా పాత్రలకు న్యాయం చేశారు.
webdunia
 
టెక్నికల్‌గా...
సాంకేతికత గురించి ఎంత చెప్పినా తక్కువే. హాలీవుడ్‌ సినిమాలను చూసిన తెలుగు ప్రేక్షకులకు తెలుగులో కూడా ఇలా తీయవచ్చా అనేట్లుగా రాజమౌళి మలిచాడు. విజువల్స్‌, కెమెరా పనితనం అదుర్స్‌. అయితే కథ రాజుకథ కాబట్టి.. దాయాదుల గొడవే. ఇది రొటీన్‌గా అనిపిస్తుంది. కొత్తదనం వుండదు. ఎలా ఒకరినొకరు మోసం చేశారనేది కొత్తగా చూపించే ప్రయత్నం. స్క్రీన్‌ప్లే బాగుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, గ్రాఫిక్స్‌ అన్నీ బాగున్నాయి. దర్శకుడుగా రాజమౌళి తన ఊహల్లోంచి చూపించిన విధానం బాగుంది. ప్రతి పాత్రకూ, సన్నివేశానికి లింక్‌ చేసే విధానం బాగుంది. 
కెమెరామెన్‌ సెంథిల్‌ కుమార్‌ దర్శకుడు ఊహ అందుకుని పనిచేశాడు. కేరళ వాటర్‌ ఫాల్స్‌, ఇంటర్‌వెల్‌ తర్వాత వచ్చే ఎపిసోడ్‌ జెకోస్లేవేకియాలో మంచు తుపాను వంటివి అద్భుతంగా తీశాడు. అసలు రాజ్యం ఎలా వుండాలనేది చేసిన సెట్‌ అద్భుతంగా వుంది. మరో లోకానికి తీసుకెళ్ళింది. సాబు సిరిల్‌ బాగా చూపాడు. విఎప్‌ఎక్స్‌.. వైజాగ్‌కు చెందిన శ్రీనివాస్‌ మురళీ మోహన్‌ గ్రాఫిక్‌ మాయాజాలంతో వార్‌ ఫీల్డ్.. గ్రాండ్‌గా చూపించాడు. చక్కని అనుభూతి కల్గించాడు.
 
ఇక సంగీత దర్శకుడిగా కీరవాణి గురించి చెప్పాలి. ఇందులో పాటలకు అవకాశమున్నా.. కథలో కొట్టుకుపోయేవి కనుక.. రెండు పాటలు పర్వాలేదు... బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో పీటర్‌హెయిన్స్‌, సాల్మన్‌రాజు బాగా చేశారు. 
 
విశ్లేషణ: 
చిత్రం కథలోకి ప్రేక్షకుడ్ని ఇన్‌వాల్వ్‌ చేయడంలో రాజమౌళి సక్సెస్‌ అయ్యాడు. కొత్త పేర్లు పాత్రలు సృష్టించి ఏదో లోకంలోకి తీసుకెళ్ళాడు. కథ కొత్తగా అనిపించకపోగా.. రాజ్యం కోసం పగ, ప్రతీకారంతో ప్రజల్ని ఉద్రేకపర్చి ప్రాణత్యాగం చేయించడం వంటివి రొటీన్‌ పాయింట్‌. వాటిని బిల్డప్‌ చేసే విధానం బాగుంది. కొన్నిచోట్ల సహజత్వానికి దూరంగా వెళ్ళి.. మెప్పించే ప్రయత్నం చేశాడు. ముగింపు కూడా బాహుబలిని నమ్మినబంటే ఎందుకు చంపాడనేది రెండో భాగంలో చూసుకోండనే ట్విస్ట్‌ ఇచ్చాడు.
 
అయితే మగధీర చిత్రం చూసినవారికి. అందులోని కొన్ని ఎపిసోడ్స్‌ ఇందులో కన్పిస్తాయి. కానీ మార్పు చేశాడు. ప్రభాస్‌ గుర్రంపై రాళ్ళను ఛేదించుకుని రావడం... శేషు మొండెంతో పరుగెత్తి పడిపోవడం... వంటివి కొన్ని అలా అనిపిస్తాయి. మంచు తుఫానులో ఛేజింగ్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. మొత్తంగా ఈ సినిమా విజువల్‌గా అద్భుతంగా తీసే ప్రయత్నం చేశాడు. సక్సెస్‌ అయ్యాడు. మరి ఈ సినిమా మాస్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది. ఫ్యాన్స్‌కు సరేసరి... కానీ వారం తర్వాత అనుకున్న క్రేజ్‌ ఎలా ఉంటుందో చెప్పలేం.
 
 
రేటింగ్‌: 3.5/5 

Share this Story:

Follow Webdunia telugu