Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొగ కమ్మిన 'సెగ'.. హీటెక్కిస్తుందో లేదో..?!!

Advertiesment
సెగ సినిమా సమీక్ష
, శనివారం, 30 జులై 2011 (17:16 IST)
WD

నటీనటులు: నాని, నిత్యమీనన్‌, కార్తీక్‌ కుమార్‌, ముత్తుకుమార్‌, బింధుమాధవి, షిమ్మోర్‌, జెన్నిఫర్‌ తదితరులు, కెమెరా: ఓంప్రకాష్‌, సంగీతం: జోష్వా శ్రీధర్‌, ఎడిటింగ్‌: ఆంథోని, నిర్మాత: వల్లభనేని అశోక్‌, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజనా అలీఖాన్‌.

ఈ చిత్రం ముందు నుంచి దర్శకురాలు అంజన గురించి గొప్పగా చెబుతుండేవారు. 'అలా మొదలైంది' కథ ఈమెదే. దాన్ని స్నేహితురాలు నందినీరెడ్డికి అప్పగించిందని. ఆ సినిమానే బాగుంటే... ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇంకెంత బాగుంటోందననే ఉత్కంఠ ఉంటుంది. అయితే సినిమా చూశాక.. కాస్త గందరగోళం నెలకొంది. కథ చాలా పెద్దది. దాన్ని మూడు గంటల్లో చెప్పే విధానం... బ్రోతల్‌కేస్‌ వంటి కథనాలు కాస్త బోరు కొట్టిస్తాయి.

కథలోకి వెళితే....
ఓ స్లమ్‌ ఏరియాలో నివశించే కార్తీక్‌(నాని)ని అతని సోదరుడు బలాజీ (ముత్తుకుమార్‌) తమ ఛాయలు పడకుండా చూసుకుంటాడు. కారణం వీరి తండ్రి జ్యోతి(షిమ్మోర్‌) బ్రోతల్‌ వ్యాపారం చేయడమే. తను పెయింటింగ్‌లు వేస్తూ తమ్ముడ్ని ఇంజనీరింగ్‌ చదివిస్తాడు. కార్తీక్‌కు ఎదురింటి రేవతి(నిత్య) అంటే ఇష్టం. ఆమె స్లమ్‌ ఏరియాలో జిరాక్స్‌ షాపులో పనిచేస్తుంది. అక్కడే మెకానిక్‌‌గా ఉన్న విష్ణు (కార్తీక్‌).. కార్తీక్‌(నాని)కి స్నేహితుడు. అయితే జ్యోతి కంపెనీలో వేశ్యగా ఉండే వాణి( బింధుమాధవి)పై విష్ణు మనసుపారేసుకుంటాడు.

కానీ.. ఈ విషయం జ్యోతికి తెలిసి.. చిన్న కండిషన్‌ పెడతాడు. తానిచ్చిన డ్రగ్‌ పాకెట్‌ను వేరే పార్టీకి విష్ణు చేర్చాలి. దీంతో అతనికి తోడుగా కార్తీక్‌ కూడా వెళతాడు. అయితే ఇక్కడే ట్విస్ట్‌... ఈ పనిలో అనుకోని సంఘటన జరుగుతుంది. దాంతో వారి జీవితాలు ఎలా మారిపోయాయి? అనేది మిగిలిన సినిమా.

పాత్రలపరంగా అందరూ బాగానే చేశారు. నాని తన పాత్రకు న్యాయం చేశాడు. పాత్రపరంగా కాస్త అన్‌గ్లామర్‌గా కన్పించాడు. నిత్యమీనన్‌ అందంగా కన్పించింది. కార్తీక్‌ అనే నటుడు పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. ముత్తు కుమార్‌ ప్రెజెంటేషన్‌ బాగుంది. వేశ్యగా బిందుమాధవి పాత్రకు సరిపోయింది. వేశ్య పనులు చేయించే షిమ్మోర్‌ పాత్ర సూటయింది.

ఈ కథకు దర్శకురాలు సరైన క్లారిటీ ఇవ్వలేకపోయింది. పాత్రల్లో ఎమోషన్స్‌, వాటి విస్తరణలో లోపం కన్పించింది. ఇటువంటి పాత్రలను మరింత ఎస్టాబ్లిష్‌ చేస్తే బాగుంటుంది. ప్రధానమైంది... ఇద్దరు హీరోయిన్లు ఉన్నా రొమాన్స్‌ అనేదానికి ఆస్కారం లేకుండా చేయడమే చిత్రానికి మైనస్‌. కొత్త తరహా కథలతో ముందుకు వచ్చిన దర్శకురాలు మరింత శ్రద్ధపెడితే బాగుండేది. క్లైమాక్స్‌లో సరైన కమాండ్‌లేక అర్థంతరంగా ముగిసిపోయినట్లుంది. ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగే యుద్ధంలో సెగ అనేది పొగలాగా మారిపోయింది.

సంగీతపరంగా జోష్వా శ్రీధర్‌ ప్రేమిస్తే తర్వాత మంచి పాటలకు ట్యూన్స్‌ ఇచ్చాడు. మూడు పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సరిగ్గా సింక్‌ కాలేదు. సంభాషణలు ఆకట్టుకునేట్లుగా లేవు. ఇంకా మరింత కసరత్తు చేస్తే బాగుండేది. ఓంప్రకాష్‌ కెమెరాపని బాగుంది. దర్శకురాలిగా కొత్తదనం చేయాలని ప్రేమకథలు, సెంటిమెంట్‌ కాన్సెప్ట్‌ను తీసుకోకుండా కాస్త డిఫరెంట్‌గా తీసుకుంది. మెచ్చతగిందే అయినా ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటే చిత్రం రక్తికట్టేది.

Share this Story:

Follow Webdunia telugu