Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్య ఫ్యాన్స్ తడఖా... ఎన్టీఆర్ బ‌యోపిక్ రిలీజ్ డేట్ ఛేంజ్...

Advertiesment
బాలయ్య ఫ్యాన్స్ తడఖా... ఎన్టీఆర్ బ‌యోపిక్ రిలీజ్ డేట్ ఛేంజ్...
, గురువారం, 20 డిశెంబరు 2018 (14:32 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌తో రూపొందుతోన్న ఎన్టీఆర్ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ భారీ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీని ఫ‌స్ట్ ఒక పార్ట్ గానే తీయాలి అనుకున్నారు. అయితే… ఈ సినిమా నిడివి 3 గంట‌ల‌కు పైగా వ‌స్తుండ‌టంతో అంత నిడివితో తీయ‌డం రిస్క్ అని భావించి రెండు పార్టులుగా తీయాల‌ని నిర్ణ‌యించుకున్నారట‌. 
 
మొద‌టి పార్టుకు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, రెండో పార్టుకు ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు అనే టైటిల్స్ ఖ‌రారు చేసార‌నే విష‌యం తెలిసిందే. ఈ నెల 21న ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.
 
అయితే… సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు చిత్రాన్ని జ‌న‌వ‌రి 24న రిలీజ్ చేయాల‌నుకున్నారు. ఆ త‌ర్వాత ఫ‌స్ట్ పార్ట్‌కు సెకండ్ పార్టుకు మ‌ధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే బాగుంటుంద‌ని ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 7న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. కొంతమంది అభిమానులయితే.. పార్టు 1, పార్టు 2కి మ‌ధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే బాగుంటుంద‌ని చెప్పార‌ట‌. అలా చెప్ప‌డం వ‌ల‌నే ముందు అనుకున్న‌ట్టుగా జ‌న‌వ‌రి 24న కాకుండా ఫిబ్ర‌వ‌రి 7న రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న రొమాంటిక్ హీరో