Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంక్రాంతికి నాగబాబు తనయుడు వరుణ్ 'ముకుంద'

సంక్రాంతికి నాగబాబు తనయుడు వరుణ్ 'ముకుంద'
, సోమవారం, 17 నవంబరు 2014 (20:12 IST)
నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'ముకుంద'. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 'సీతమ్మవాకిట్లో...' దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. మిక్కీ జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. లియో ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఠాగూర్‌ మధు సమర్పిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ... ఓ పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. 
 
ఆ పాటను త్వరలో హైదరాబాద్‌లో సెట్‌వేసి తీస్తాం. ఇంతకుముందు నేను తెరకెక్కించిన రెండు సినిమాలు ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు. ఇది యాక్షన్‌ ఓరియెంటెడ్‌ లవ్‌స్టోరీ. రూరల్‌ టౌన్స్‌లో జరిగే ప్రేమకథలు, అక్కడి పాలిటిక్స్‌ వల్ల స్థానిక కుర్రాళ్ళ భావోద్వేగాలు ఎలా వుంటాయనేది, సహజంగా చూపించే ప్రయత్నం చేశాం. 
 
ఎలాంటి అంశాలకు ప్రభావితం కాని స్థిరంగా వుండే కుర్రాడి నేచర్‌ని చెప్పాలనుకున్నాం. రూరల్‌ టౌన్‌ కథ కనుక భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోటలో షూటింగ్‌ చేశాం. నిర్మాతలు చిత్రాన్ని లావిష్‌గా తెరకెక్కించారు. పాటల్ని డిసెంబర్‌ 14, చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. ప్రకాష్‌రాజ్‌, నాజర్‌, రావురమేష్‌, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మణికందన్‌.

Share this Story:

Follow Webdunia telugu