Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ నెల 7న ఇస్మార్ట్ శంక‌ర్ బోనాలు ఈవెంట్... ఇంత‌కీ ఈ ఈవెంట్ ఎక్క‌డ‌..?

Advertiesment
iSmart Sankar
, శనివారం, 6 జులై 2019 (13:52 IST)
ఎనర్జిటిక్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ని పూరి - ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ న‌టిస్తున్నారు. రామ్ ఒక పక్కా తెలంగాణ ప్రాంత మాస్ కుర్రాడిగా నటిస్తున్నారు. 
 
ఈ సినిమా ట్రైలర్‌లో రామ్ చెప్పిన  ‘ఏ బొమ్మా.. నువ్వు ‘ఊ’ అంటే గోల్కొండ రిపేరు జేసి నీ చేతిలో పెడతా. నిన్ను బేగంను చేసి ఖిల్లా మీద కూర్చో పెడతా.. క్యా బోల్తే..ఆ’ అనే డైలాగు,  ‘ఒరేయ్, వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చ పోయించినా..’ అంటూ నభా నటేశ్ చెప్పిన డైలాగులు క్రేజీగా మారి సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న తమ సినిమా తప్పకుండా మంచి సక్సెస్‌ని అందుకుంటుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 
 
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని బోనాలు పేరుతో ఈనెల 7న సాయంత్రం 6 గంటలకు, వరంగల్ జిల్లాలోని హన్మకొండలో గల హైగ్రీవాచారి గ్రౌండ్‌లో యూనిట్ సభ్యులు మరియు అతిరథ మహారథుల సమక్షంలో ఎంతో వేడుకగా నిర్వహించాలని నిర్ణయించారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ సినిమా పాటలు ఇప్పటికే శ్రోతల నుండి మంచి స్పందనను రాబడుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమాని ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏం చేస్తాడో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాంకర్ అవతారమెత్తనున్న రామ్ చరణ్..