Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ రెక్కీ... ఫస్ట్ లుక్ విడుదల

Advertiesment
crime
విజ‌య‌వాడ‌ , సోమవారం, 27 డిశెంబరు 2021 (15:33 IST)
స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ రెక్కీ, కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. సాకా ఆదిలక్ష్మి సమర్పణ,  ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా, కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. 
 
 
ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన వేడుకలో యూనిట్ సభ్యులు ఆవిష్కరించుకున్నారు. చిత్ర కథానాయకుడు అభిరామ్, దర్శకుడు ఎన్. ఎస్.ఆర్.ప్రసాద్, నాయకి సమీక్ష, సెకండ్ హీరో భద్రమ్, ఈ చిత్రంలో ఓ ముఖపాత్ర పోషించిన భాష, ఎడిటర్ పాపారావు ఈ వేడుకలో పాల్గొన్నారు.
 
 
క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాoశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న రెక్కీ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న రెక్కీ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ గారు అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
 
 
నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్, ఆర్ట్: రాజు, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున, సమర్పణ: శ్రీమతి సాకా ఆదిలక్ష్మి, నిర్మాత: కమలకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేశ్‌కు అరెస్టు వారెంట్