Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏప్రిల్ చివరి వారంలో రానా - ఇలియానాల "నేను - నా రాక్షసి"

Advertiesment
నేనూ నా రాక్షసి
, గురువారం, 21 ఏప్రియల్ 2011 (18:02 IST)
WD
"లీడర్" రానా హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బేబి భవ్య సమర్పణలో హిట్ చిత్రాల నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్( బుజ్జి) నిర్మించిన భారీ చిత్రం "నేను నా రాక్షసి" డీటిఎస్ మిక్సింగ్ చేసుకుని ఏప్రిల్ చివరి వారంలో విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా దర్శకులు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ... రెగ్యులర్ రొటీన్ చిత్రాలకు భిన్నమైన కథాంశంతో రూపొందిన లవ్ థ్రిల్లర్ ఇది. రానా, ఇలియానా కాంబినేషన్లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా రూపొందింది. నాకు ఎంతో ఇష్టమైన సబ్జెక్టుతో తీసిన డిఫరెంట్ కమర్షియల్ ఫిలిమ్ ఇది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... మా బ్యానర్లో పూరి జగన్నాథ్ గారితో చేసిన ఫస్ట్ మూవీ. రానా, ఇలియానా కాంబినేషన్ ఈ సినిమాకు హైలెట్. ఆడియోకి చాలామంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం డీటిఎస్ మిక్సింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెల చివరి వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ వేసవిలో ఇది మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ అవుతుంది అన్నారు.

రానా, ఇలియానా, అభిమన్యు సింగ్, సుబ్బరాజు, అలీ, ముమైత్ ఖాన్, ముక్తార్ ఖాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విశ్వ-రెహమాన్, డాన్స్: రాజు సుందరం, సమర్పణ: బేబి భవ్య, నిర్మాత: నల్లమలుపు బుజ్జి, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: పూరి జగన్నాథ్

Share this Story:

Follow Webdunia telugu