ఇద్దరితో పొందు.. అదే "నేటి చరిత్ర"
"
మృగం" అనే తమిళ చిత్రం ద్వారా తెలుగువారికి పరిచయమైన దర్శకుడు సామి తాజాగా రూపొందించిన తమిళ చిత్రం "సిందూస్ మళి". ఈ చిత్రాన్ని తెలుగులో "నేటి చరిత్ర"గా అనువదిస్తున్నారు. ఈ నెల 3న తమిళంలో.. 10న తెలుగులో.. 17న మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు సామి హైదరాబాదులో చెప్పారు. ఈ చిత్రం ట్రైలర్స్, ఆడియోను బుధవారం విడుదల చేశారు. మనిషిలో మృగం ఉన్నాడనీ, అతనిలో తీవ్రమైన కామవాంఛలకు ఎయిడ్స్ మహమ్మారి ఫుల్‌స్టాప్ పెడితే జీవితం ఏవిధమైన మలుపు తిరుగుతుందనేది మృగంలో చూపించాడు. "నేటి చరిత్ర"లో కూడా.. ఈనాటి సమాజంలో కోడలను మామ, అత్తను అల్లుడు, ఎనిమిదిమందిని మోసం చేసిన పెండ్లికొడుకులు.. ఇలా కథలు చాలా జరుగుతున్నాయి. అటువంటి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. స్కూలు వయస్సులోనే హీరోహీరోయిన్లు కల్యాణ్, ఆసికలు ప్రేమించుకుని ఒకటవుతారు. ఆ తర్వాత తన మామ అంటూ మరొకరితో సాన్నిహిత్యాన్ని పెంచుకుని అతనితో ఒకటవుతుంది. ఒకరికి తెలియకుండా ఒకరితో పొందును కోరుకుటుంది. ఈ నేపధ్యంలో సాగే కథాగమనమే నేటి చరిత్ర. ఈ చిత్రానికి తెలుగు నిర్మాత కిరణ్.