పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే లవర్ బాయ్ నితిన్‌కు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్‌ను నితిన్ ప్రతి సినిమాకు పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడని ఇప్పటికే ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. త్రివిక్రమ్-నితిన్-సమంతల కాంబినేషన్లో అ.. ఆ.. సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుకకు పవన్ కల్యాణ్‌ను త్రివిక్రమ్ ఆహ్వానించారు.
అత్తారింటికి దారేది సినిమా ద్వారా పవన్‌కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్.. తన అ.. ఆ.. సినిమా ఆడియో ఫంక్షన్‌కు ఆహ్వానించడం, అంతేగాకుండా నితిన్ కూడా తన అభిమాని కావడంతో పవన్ ఆడియో వేడుకకు వచ్చారు. కానీ నితిన్ ఈ ఆడియో ఫంక్షన్లో ఓవర్ చేశాడని టాక్ వచ్చింది. ఆడియో లాంఛింగ్ ప్రారంభంలోనే పవన్ కల్యాణ్ డైలాగులతో నితిన్ చేసిన యాక్షన్ కాస్త ఎబ్బెట్టుగానే అనిపించింది.
ఇక ఆడియో వేడుక మొత్తం పవన్ భజనే కనిపించడంతో నితిన్ నిజంగానే పవన్ కల్యాణ్‌కు భక్తుడా లేకుంటే పబ్లిసిటీ కోసం ఇదంతా చేశాడా అనే అనుమానాలు తలెత్తున్నాయి. ఇకనైనా నితిన్ నిజం తెలుసుకుంటే సరి.