Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవసరమైతే లైట్‌బాయ్‌గా పనిచేస్తా: నాగశౌర్య సెన్సేషనల్‌ కామెంట్‌

Advertiesment
Nagashaurya
, బుధవారం, 5 జులై 2023 (15:38 IST)
Nagashaurya
సినిమారంగంలో 24 క్రాఫ్ట్‌లలో లైట్‌బాయ్‌ కూడా ఒకటి. వారికి ఈమధ్య గౌరవాలు ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమారంగంలో హీరోగా ఎదగాలని కోరిక అందరికీ వుంటుంది. దానికోసం సక్సెస్‌ అవ్వాలని చూస్తుంటారు. కథానాయకుడు నాగశౌర్య కూడా అలాంటివాడే. చూడ్డానికి మహేష్‌బాబులా అందగాడిలా వుండే నాగశౌర్య పలు సినిమాలు చేశారు. ఛలో ఆయన కెరీర్‌లో మలుపు. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. ఎందుకనో కొన్ని సక్సెస్‌ కాలేదు. ఓ దశలో సిక్స్‌ ప్యాక్‌ కూడా పాత్రపరంగా చూపించినా ఆ సినిమా హిట్‌ సంపాదించుకోలేకపోయింది. 
 
కథలు చెప్పేటప్పుడు దర్శకుడు పేపర్‌పై బాగా పెడతారు. అది చదవగానే కెవ్వుకేకలా వుంటుంది. దాన్ని ప్రొజెక్ట్‌ చేయడంలో ఫెయిల్‌అవుతుంటారు. అలా తనకూ అనుభవాలు జరిగాయని నాగశౌర్య స్పష్టం చేశారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘రంగబలి’. ఈ సినిమా జులై 7న విడుదలకాబోతుంది. ఇందులో మన ఊరి మూలాలు చూపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ కూడా ఆసక్తికరంగా మలిచారు. అయితే కొంత గేప్‌ తీసుకున్నా, సరైన కథ, దర్శకుడికోసం ఎదురుచూస్తుంటాననీ, తనకు సినిమానే ప్రపంచం. ఇది తప్పితే నాకు ఏదీ తెలీయదు. నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలనుందని తెలియజేశారు. ఈ రంగాన్ని విడిచిపెట్టి వెల్లలేను. పేషన్‌తో ఈ రంగంలోకి వచ్చాను. అవసరమైతే లైట్‌బాయ్‌గా కూడా చేయడానికి సిద్ధం. సినిమాపై పిచ్చికి ఇదే ఉదాహరణ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్- అన్నా లెజ్నోవా విడాకులు తీసుకున్నారా?