Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమె అంటే అందరికీ ఎందుకంత ఇది.. మాయ చేసే నయని కాదే..!

నయనతారకు ఇంత గుర్తింపు ఎందుకొచ్చింది? అందరూ చెప్పుకునే మాట ఏదంటే గర్వం ఆమె దరి చేరదట. తన పని ముగియగానే ప్యాకప్ చెప్పేసి తనకు కేటాయించిన వ్యాన్‌లో దూరిపోదట. షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోనే తోటి నటీనటుల నటనను గమనిస్తుంటారు. షూటింగ్ ఆలస్యం అయినా చిరాకు ప

ఆమె అంటే అందరికీ ఎందుకంత ఇది.. మాయ చేసే నయని కాదే..!
హైదరాబాద్ , సోమవారం, 27 మార్చి 2017 (05:08 IST)
గ్లామర్ నుంచి లేడీ బాస్‌గా, సూపర్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన చరిత్ర గతంలో విజయశాంతి సొంతం. ఆ తర్వాత అంత స్టార్ డమ్‌ని అందుకున్న హీరోయిన్ ఎవరూ కనబడరు. మయూరి, ప్రతిఘటన సినిమాలనుంచి కర్తవ్యం వరకు చేరుకున్న ఆమె నట వైదుష్యం ఒక్కసారిగా ఆమెను దక్షిణాది అమితాబ్ బచ్చన్ స్థాయిలో నిలిపింది. 15 ఏళ్లుకు పైగా చిత్రసీమలో ఆమె ఆడింది ఆట పాడింది పాటగా గడిచిపోయింది. అంతటి స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ ఇటీవలి వరకు పుట్టలేదు. కానీ ఆస్థానాన్ని భర్తీ చేయడానికి తానున్నానని  బరిలో నిలిచిన మరొక హీరోయిన్ ఎవరంటే నయనతారే అని చెప్పాలి.
 
సినీ పరిశ్రమకు వచ్చి పదేళ్లు దాటింది. కానీ అగ్రహీరోలు, వృద్ధ హీరోలు, పడుచు హీరోలు.. ఇలా వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఇవ్వాళ ఆమెనే తమ హీరోయిన‌గా ఎన్నుకుంటున్నారంటే ఆమె త్రిషలాగా, తమన్న లాగా, రకుల్ ప్రీత్ సింగ్ లాగా  గ్లామర్ క్వీన్ కాదు. అయినా ఆమె ఇప్పుడు అందరూ కోరుకునే హీరోయిన్, దక్షిణాది చిత్రపరిశ్రమలోనే అగ్ర హీరోయిన్ ఆమె. యువదర్శకులకు, సీనియర్ దర్శకులకు ఆమె అంటే కాసుల పంట పండించి తెచ్చిపోసే ధన లక్ష్మి. 
 
నయనతారకు ఇంత గుర్తింపు ఎందుకొచ్చింది? అందరూ చెప్పుకునే మాట ఏదంటే గర్వం ఆమె దరి చేరదట. తన పని ముగియగానే ప్యాకప్ చెప్పేసి తనకు కేటాయించిన వ్యాన్‌లో దూరిపోదట. షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోనే తోటి నటీనటుల నటనను గమనిస్తుంటారు. షూటింగ్ ఆలస్యం అయినా చిరాకు పడరు. ఇలాంటి సహాయ గుణం ఉన్న నటి దొరికితే ఎవరైనా కాదంటారా? అందుకే అందరిక ఆమె అంటే ఆరాధన. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కడ దీపిక.. ఇక్కడ అనుష్క.. నిలువెత్తు అంకిత భావం వీరి సొంతం