మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. ఇటీవలే ట్విట్టర్‌లో ఆయన వాడిన భాషకు ఓ విలేకరి ప్రశ్నించారు. అదేమిటంటే.. పిట్టలు రెట్టలేస్తుంటాయి. వాటిని పట్టించుకోకూడదనేది దర్శకుడు భావన.
దానికి ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేయడయానికి కారణం నా అభిప్రాయాన్ని చెప్పాను. సినిమా అనేది వందలాది మంది సమిష్టి కృషి. సినిమాని పూర్తి గా చూసి అర్ధం చేసుకొని విశ్లేషించుకొని దాని గురించి రాయడంలో ఎలాంటి ఆభ్యంతరం లేదు. రివ్యూలు వుండాలి. రివ్యూలు చదివి చాలా నేర్చుకున్నా. చాలా మంది మంచి రివ్యూ రైటర్స్ తెలుగులో వున్నారు. కానీ సినిమా జరుగుతుండగానే స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ సాంగ్, ఫస్ట్ ఫైట్ అని రివ్యూలు ఇచ్చే విధానం మాత్రం సరికాదు. ప్రోడక్ట్ అనేది వినియోగదారుడికి చేరకముందే ఇంత నెగిటివిటీ ఎందుకు ? అనే బాధతోనే నా అభిప్రాయం చెప్పాను అని వివరించారు.