Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీముఖి పిడకలు కొట్టింది.. అలీకి హగ్గులు.. తమన్నా షర్టు గొడవ..

శ్రీముఖి పిడకలు కొట్టింది.. అలీకి హగ్గులు.. తమన్నా షర్టు గొడవ..
, గురువారం, 1 ఆగస్టు 2019 (18:13 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. బుధవారం జరిగిన 11వ ఎపిసోడ్‌లో శివజ్యోతి- వరుణ్ సందేశ్‌ల మధ్య వైరం, వరుణ్-వితికాల మధ్య స్వల్ప వివాదం, కరెంట్, గ్యాస్ ఉత్పత్తి కోసం సైకిల్ తొక్కుతూ మిగిలిన కంటిస్టెంట్స్ కష్టపడ్డారు. ఇక తమన్నా సింహాద్రి పదరా పాటకు కాకరేపే స్టెప్పులేసింది. శ్రీముఖి-బాబా భాస్కర్‌ల మధ్య సరదా సరదా సన్నివేశాలతో ఎపిసోడ్ ప్రారంభం కాగా.. తమన్నా సింహాద్రి చీపురు పట్టుకుని అలీ రజాకు చుక్కలు చూపించింది. 
 
స్నానం చేసి టవల్‌తో బయటకు వస్తున్న అలీని చూస్తూ తమన్నా.. హౌస్‌లో ఈ ఎక్స్‌పోజింగ్ ఏంటి అంటూ ప్రశ్నించింది. తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు తనకు లేదా బిగ్ బాస్ అంటూ సరదాగా మాట్లాడారు అలీ. షర్టు లేకుండా అలా విప్పుకుని తిరిగితే కుదరదని తమన్నా అంటే.. తన డ్రెస్ గురించి మీరెందుకు అడుగుతున్నారని చెప్పాడు. అయితే ఈ వివాదంపై బిగ్ బాస్ 3 ట్రోల్స్‌లో మీమ్స్ పేలుతున్నాయి. అలీ షర్టు వేసుకోలేదు.. మేడమ్ ప్యాంటు వేసుకోలేదు.. అంతే డేటా అంటూ తమన్నా పొట్టి డ్రెస్‌పై మీమ్స్ పేలుతున్నాయి. 
 
ఇక వరుణ్ సందేశ్ హేళన చేయడంతో శివజ్యోతి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఈవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా శ్రీముఖి, అలీలకు పిడకలు వేసే పనిని అప్పగించారు బిగ్ బాస్. నిర్ణీత సమయానికి 100 పిడికలు వేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో శ్రీముఖి, అలీలు పిడకల యుద్ధం మొదలుపెట్టి.. వంద కంటే ఎక్కువ పిడకలే కొట్టి.. ఇంటికి గ్యాస్ కొరతను తీర్చుకున్నారు. గేమ్‌లో పోటీ పడి పిడకలు కొట్టి గెలిచిన శ్రీముఖి.. అలీని హగ్‌లతో ఉక్కిరి బిక్కిరి చేసింది. గెలిచిన ఆనందంలో అమ్మాయిలకు కిస్‌లు ఇస్తూ.. అలీకి కౌగిలి అందించింది.
 
ఇక వాటర్ ప్రాబ్లమ్‌ని తీర్చుకోవడానికి మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌ని వరుణ్ భార్య వితికాకు అప్పగించారు. ఒకతొట్టెలో చేపలతో పాటు కొన్ని కాయిన్స్ ఇచ్చి వీటిలో యాభైకదితికా.. ఈ టాస్క్‌ను దిగ్విజయంగా పూర్తి చేసి నీటి కొరతను తీర్చారు. మరోవైపు మహేష్ కూడా దీపాన్ని ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడటంతో ఈవారం లగ్జరీ బడ్జెట్‌ను సాధించారు కంటెస్టెంట్స్. 
 
వరుణ్, తమన్నాలు.. హౌస్‌లో ఉన్న 15 మంది కంటెస్టెంట్స్‌లో చెత్త పెర్ఫామెన్స్ ఇచ్చిన ఇద్దరి పేర్లు సూచించాలని బిగ్ బాస్ ఆదేశించగా.. ఎవరూ పేర్లు చెప్పడానికి ముందుకు రాకపోవడంతో తమన్నా, వరుణ్‌లు తమకు తామే చెత్త పెర్ఫామెన్స్‌గా ప్రకటించుకుని బిగ్ బాస్‌కి తమ పేర్లను చెప్పారు. దీంతో బిగ్ బాస్ ఈ ఇద్దర్నీ తదుపరి ఆదేశం వచ్చేంతవరకూ జైల్‌లో ఉండాలని కోరారు. అనంతరం కోరిమరీ జైలుకు వెళ్లిన తమన్నా.. నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదు అంటూ గుక్కపెట్టి ఏడ్చేసింది. ఇక శ్రీముఖి నేతృత్వంలో తమన్నాకు ఓదార్పు లభించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితులే "ఆ" విషయాలు నేర్పించారు : సోనాక్షి సిన్హా