రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై స్టైల్, స్నేహగీతం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ లాంటి హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత లగడపాటి శ్రీధర్. ఆయన తనయుడు విక్రమ్ సహిదేవ్ ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన సినిమా "వర్జిన్ స్టోరి". కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. "వర్జిన్ స్టోరి" సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత లగడపాటి శ్రీధర్ ప్రెస్ మీట్ లో తెలియజేశారు.
- తెలుగులో యూత్ సినిమాలు అని చెబుతుంటారు గానీ అలాంటి సినిమాలు మన దగ్గర రావు. యూత్ సినిమా అంటే టీనేజ్ కథలు చూపించకుండా పెద్దవాళ్లు లవ్ స్టోరీలు చూపిస్తారు.
- 16 ఏళ్ల యువతీ యువకుల మనోభావాలను తెరకెక్కించే చిత్రాలు మన దగ్గర రాలేదు. "వర్జిన్ స్టోరి"లో ఆ ప్రయత్నం చేస్తున్నాం. యుక్తవయసులో ఉండే అమ్మాయి, అబ్బాయి జీవితంలో ఒక రొమాన్స్ మొదలవుతుంది.
- మనం నిజంగా ప్రేమించిన వ్యక్తి సన్నిహితంగా ఉన్నప్పుడు మనసు, శరీరం నిజాయితీగా స్పందిస్తాయి. ప్రేమ లేని వాళ్ల దగ్గర ఆ ఫీలింగ్ రాదు. యువత అలాంటి జతను ఎంచుకోండని చెప్పే చిత్రమిది. మీకు నిజంగా ఫీలింగ్ లేనప్పుడు ప్రేమించి వృథా. యువత జీవితంలో రొమాన్స్ ఉండాలి.
- స్టైల్ సినిమా కథ విని వెంటనే షూట్ కు వెళ్లండి అని చెప్పాను. అలా బౌండ్ స్క్రిప్టుతో వచ్చిన సినిమా ఇది. వెంటనే ఓకే చెప్పాను. టీనేజ్ వాళ్లకే కాదు అలాంటి మనసున్న పెద్ద వాళ్లకూ "వర్జిన్ స్టోరి" నచ్చుతుంది. పిల్లల్ని అర్థం చేసుకోవాలి అనుకున్న పెద్ద వాళ్లు మా సినిమా చూడొచ్చు.
- విక్రమ్ సహిదేవ్ మా అబ్బాయి అని సినిమా చేయడం కాదు. అతనిలో నటుడిగా పేరు తెచ్చుకోవాలనే ఆసక్తి ఉంది. తను బయట క్రేజీ చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు సినిమాల పరిస్థితి సందిగ్ధంగా ఉంది. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. మా చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసి అప్పుడు విక్రమ్ నెక్ట్ సినిమా గురించి ప్లాన్ చేస్తాం.