Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరెడ్డికి ధైర్యం కావాలి.. నాకైతే అలాంటి అనుభవం లేదు: విశ్వరూపం ఆండ్రియా

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇప్పటివరకు టాలీవుడ్ మీద ఆరోపణలు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ మీద పడింది. కోలీవుడ్‌లో ప్రముఖులు మురుగదాస్, రాఘవ లారెన్స్, సుందర్ సి, శ్రీకాంత్‌లపై విరుచుకుపడింది. ప్రస్తుతం ఛాన

Advertiesment
Vishwaroopam
, శనివారం, 11 ఆగస్టు 2018 (13:24 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇప్పటివరకు టాలీవుడ్ మీద ఆరోపణలు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ మీద పడింది. కోలీవుడ్‌లో ప్రముఖులు మురుగదాస్, రాఘవ లారెన్స్, సుందర్ సి, శ్రీకాంత్‌లపై విరుచుకుపడింది. ప్రస్తుతం ఛానెళ్లకు, యూట్యూబ్‌లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా శ్రీరెడ్డి ఆరోపణలపై నటి, గాయని ఆండ్రియా స్పందించింది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఎంతో ధైర్యం అవసరమని ఆండ్రియా చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి వివాదాల గురించి తనను ప్రశ్నిస్తూ ఉంటారని... ఆమె చెబుతున్న వాటిలో నిజం ఉంటే, వాటిని బహిరంగపరచడానికి ఆమెకు ఎంతో ధైర్యం కావాలని చెప్పింది.

ఎవరికైనా అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు, వాటిని కచ్చితంగా బయటపెట్టాలని సూచించింది. ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పింది. తనకైతే ఇంతవరకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని వెల్లడించింది. మహిళల బలహీనతలను అడ్డం పెట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడటం సరికాదు అని అండ్రియా చెప్పుకొచ్చింది.
 
తాజాగా లోకనాయకుడు కమలహాసన్ సరసన ఆండ్రియా నటించిన 'విశ్వరూపం-2' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించిన తరువాత తనలో సామాజిక బాధ్యత ఎక్కువైందని వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్ 8న నిఖిల్ "ముద్ర"