Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్ను సలసలా కాగే నూనెలో వేసి.... ఫ్రై చేస్తాం..

సినీనటులకు సాధారణంగా బెదిరింపులు వస్తుంటాయి. ఎవరో ఒకరు ఫోన్ల ద్వారానో లేకుంటే మరో రూపంలో హింసిస్తుంటారు. హీరోల కన్నా హీరోయిన్లకే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందంగా ఉండే హీరోయిన్ల నెంబర్లను ఎలాగోలా సేకరి

Advertiesment
నిన్ను సలసలా కాగే నూనెలో వేసి.... ఫ్రై చేస్తాం..
, శనివారం, 29 జులై 2017 (12:13 IST)
సినీనటులకు సాధారణంగా బెదిరింపులు వస్తుంటాయి. ఎవరో ఒకరు ఫోన్ల ద్వారానో లేకుంటే మరో రూపంలో హింసిస్తుంటారు. హీరోల కన్నా హీరోయిన్లకే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందంగా ఉండే హీరోయిన్ల నెంబర్లను ఎలాగోలా సేకరించే కొంతమంది ఆకతాయిలు వారిని ఇబ్బందులు పెట్టేలా ప్రవర్తిస్తుంటారు. గతంలో తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన వారు ఇలాంటి ఇబ్బందులే పడ్డారు. అయితే ఈసారి హీరోను టార్గెట్ చేశారు కొంతమంది సినీప్రముఖులు. ఆయనెవరో కాదు తమిళ నటుడు విశాల్.
 
విశాల్ ఫోన్ నెంబ‌ర్‌ను కనిపెట్టిన కొంతమంది ఆకతాయిలు ఆయనకు వాట్సాప్‌ల ద్వారా రకరకాల మెసేజ్‌లను పంపిస్తున్నారట. అపరిచితుడులో అవినీతి చేసిన వారిని విక్రమ్ ఎలాగైతే సలాసలా కాగే నూనెలో వేసి ఫ్రై చేస్తాడో అదేవిధంగా నిన్ను కూడా ఫ్రై చేస్తాం.. ఎక్కువ చేస్తున్నావంటూ వాట్సాప్‌ల ద్వారా మెసేజ్‍‌లు పంపిస్తున్నారట. 
 
మొదట్లో పెద్దగా పట్టించుకోని విశాల్ గత రెండురోజులుగా మెసేజ్‌లు మరింత ఎక్కువవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాల్ తరపున నిర్మాతలు మణిమ్మరన్‌, మహమ్మద్‌ సాహిల్‌ చెన్నై సీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో వాట్సాప్‌లో ఉన్న ఆకతాయిల ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారట.
 
అయితే ఇది ఆకతాయిల పనా లేకుండా విశాల్‌ను ఇబ్బందులు పెట్టడానికి సినీపరిశ్రమలకు చెందిన వారెవరైనా ఇలా చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే విశాల్ నడికర్ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ కుటుంబాన్ని అంతం చేస్తాం.. లవ్ జిహాద్ :: అయేషా ట‌కియా భ‌ర్త‌కు బెదిరింపులు