Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

Advertiesment
Vijay Deverakonda  released a song from Muthaiah

దేవీ

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (14:43 IST)
Vijay Deverakonda released a song from Muthaiah
కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య'. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మరియు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. త్వరలో 'ముత్తయ్య' సినిమా ఈటీవీ విన్ లో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. 
 
ఈ రోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా 'ముత్తయ్య' సినిమా నుంచి 'సీనిమాల యాక్ట్ జేశి..' పాటను రిలీజ్ చేశారు. ఈ పాట లాంఛ్ చేయడం సంతోషంగా ఉందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా తమ కలల్ని సాకారం చేసుకోవాలని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా అన్నారు. 'ముత్తయ్య' సినిమా టీమ్ కు విజయ్ దేవరకొండ తన బెస్ట్ విశెస్ అందించారు.
 
'సీనిమాల యాక్ట్ జేశి..' పాటను మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ రోడ్రిగ్స్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. దర్శకుడు భాస్కర్ మౌర్య ముత్తయ్య పాత్రను రిఫ్లెక్ట్ చేస్తూ లిరిక్స్ రాయగా, చిన్నా.కె. ఆకట్టుకునేలా పాడారు. 'సీనిమాల యాక్ట్ జేశి..' పాట ఎలా ఉందో చూస్తే - 'సీనిమాల యాక్టు జేశి ఎలిగిపోతవా...బుట్టలల్లుకుంట ఊళ్ళె మిలిగిపోతవా..ముత్తయ్య... తిక్క తిక్క ఈడియోలు జేసుకుంటవా..స్టెప్పులేసి ఎగిరి దుంకి సంపుతుంటవా..ముత్తయ్య.... పేమసైతవా పేళ్లు గోళ్లు గిల్తవా... దేశమంత లొల్లి జేస్తావా... డ్యాన్సు జేస్తవా డయ్యిలాగు జెబుతవా ఓపికంత కూడ వెడ్తావా... ముత్తయ్య..' అంటూ ముత్తయ్య వెండితెర కలను వర్ణిస్తూ సాగుతుందీ పాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్