Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

విజయ్ ఆంటోనీ జీవితంలో ఎలాంటి ఘటనలైనా ఎదుర్కొంటారు : సత్యరాజ్

Advertiesment
Vijay Antony, Sathyaraj and others

డీవీ

, శనివారం, 27 జులై 2024 (13:02 IST)
Vijay Antony, Sathyaraj and others
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో మాటలు, పాటల రచయిత భాష్యశ్రీ మాట్లాడుతూ - "తుఫాన్" ఆగస్టు 2న థియేటర్స్ లోకి వస్తోంది. మంచి స్క్రీన్ ప్లే ఉన్న చిత్రమిది. మీరంతా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అలాగే డబ్బింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. "తుఫాన్" సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారికి థ్యాంక్స్. అన్నారు.
 
హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ - సత్యరాజ్ గారు ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు. ఆయన మా మూవీలో భాగమవకుంటే ఇది అసంపూర్తి అయ్యేది. డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు మంచి స్క్రిప్ట్ ఈ మూవీకి రాశారు. నా రైట్ హ్యాండ్ లాంటి పర్సన్ డైలాగ్ రైటర్ భాష్యశ్రీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ భారీ సినిమా చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అయినా కంటెంట్ మీద నమ్మకంతో మా ప్రొడ్యూసర్స్ కమల్, ప్రదీప్, ధనుంజయన్ గారు "తుఫాన్" సినిమా చేశారు. త్వరలో ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేస్తాం. అది మూవీపై ఇంకా ఆసక్తిని పెంచుతుంది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది. నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమే. హైదరాబాద్ తో, తెలుగు ఆడియెన్స్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. "తుఫాన్" సినిమాతో మీకు మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నా. అన్నారు.
 
యాక్టర్ సత్యరాజ్ మాట్లాడుతూ - "తుఫాన్" సినిమా తమిళ ట్రైలర్ లాంఛ్ లో నా స్పీచ్ కు చాలా మీమ్స్ వచ్చాయి. ఈ మూవీలో లాస్ట్ మినిట్ నేను జాయిన్ అయ్యాను. నా క్యారెక్టర్ ను దర్శకుడు విజయ్ మిల్టన్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. నా లుక్, మేకోవర్ అంతా కొత్త ఉంటుంది. ప్రొడ్యూసర్ ధనుంజయన్ చిన్న పిల్లాడి ఫేస్ తో ఉంటారు. ఆయన అడిగితే ఏదీ కాదని చెప్పాలనిపించదు. విజయ్ ఆంటోనీ కి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ను ఎలా వేర్వేరుగా చూసుకోవాలో తెలుసు. ఆయన ఒక ఫిలాసపర్. ఆయన జీవితంలో ఎలాంటి ఘటనలైనా ఎదుర్కొంటారు. నాకు నచ్చిన థ్రిల్లర్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఆగస్టు 2న థియేటర్స్ లో చూసి మీ రెస్పాన్స్ తెలియజేయాలని కోరుతున్నా. అన్నారు.
 
నిర్మాత జి. ధనుంజయన్ మాట్లాడుతూ -  "తుఫాన్" ఒక క్వాలిటీ, కమర్షియల్, ఎంటర్ టైన్ మెంట్ ఉన్న సినిమా. మ్యూజిక్ తో పాటు మంచి డైలాగ్స్ ఉంటాయి. విజయ్ ఆంటోనీ మిమ్మల్ని ఈ సినిమాతో ఆకట్టుకుంటారు. చాలా మంది ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. మా రైటర్ భాష్యశ్రీ మంచి డైలాగ్స్ రాశారు. ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ తో మా డైరెక్టర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాను రూపొందించారు. ఆగస్టు 2న థియేటర్స్ లో "తుఫాన్" చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
 
డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ -  సత్యరాజ్ గారి సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్ గా 30 ఏళ్ల క్రితం పనిచేశాను. ఇప్పుడు ఆయనతో డైరెక్టర్ గా వర్క్ చేయడం బ్లెస్సింగ్ గా భావిస్తున్నా.  అచ్చు రాజమణి గారి మ్యూజిక్ "తుఫాన్" సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కొన్నేళ్ల నుంచి ఆయన నా టీమ్ మెంబర్ గా ఉంటూ వస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా విజయ్ ఆంటోనీ గారు తన సపోర్ట్ నాకు ఇస్తూనే ఉన్నారు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లరి నరేష్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం