Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రముఖ నృత్య దర్శకుడు కూల్ జయంత్ కన్నుమూత

ప్రముఖ నృత్య దర్శకుడు కూల్ జయంత్ కన్నుమూత
, గురువారం, 11 నవంబరు 2021 (10:56 IST)
Cool Jayanth
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా వరుసగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ నృత్య దర్శకుడు కూల్ జయంత్ తుదిశ్వాస విడిచారు.
 
ఆయన వయస్సు 44 సంవత్సరాలు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని వెస్ట్ మాంబళంలోని తన నివాసంలో బుధవారం ఉదయం కన్నుమూశారు. డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. ప్రభుదేవా, రాజు సుందరం మాస్టర్ట్స్ డ్యాన్స్ ట్రూప్‌లలో పనిచేశాడు. సుమరు 800 చిత్రాల్లో డ్యాన్సర్‌గా చేశారు.
 
'కాదల్‌ దేశం' చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు. తమిళం, మలయాళం భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి ప్రముఖ నటుల చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన మృతిపై పలువురు తమిళ, మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
 
కాదల్ దేశం'లో కూల్ జయంత్‌ను పరిచయం చేసిన నిర్మాత కెటి కునుజోమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "ఓమ్.. ప్రార్థనలు.. కొరియోగ్రాఫర్ కూల్ జయంత్ మృతి చెందడం చాలా బాధాకరం. కాదల్ దేశం చిత్రంలోని 'కల్లూరి సాలై' పాటకు మీరు పడిన శ్రమ, ప్రతిభ గుర్తుకొస్తున్నాయి. నా హృదయపూర్వక సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డేటా కావాలి.. అడిగింది ఎవరు?