ఇటీవలి కాలంలో వెంకటేష్‌కి మల్టీస్టారర్‌లు బాగా కలిసి వస్తున్నాయి. ఈ మేరకు ఆయన వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో నటించిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని సాధించిన విషయం కూడా తెలిసిందే. కాగా... ప్రస్తుతం వెంకటేష్, నాగచైతన్యతో కలిసి 'వెంకీమామ' అనే మరో మల్టీస్టారర్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వెంకటేష్ త్వరలో రవితేజతో కలిసి వీరు పోట్ల దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్ చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే... ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం.
నిర్మాత అనిల్ సుంకరకి వెంకటేష్ ఒక సినిమా చేయవలసి ఉందట. అనిల్ సుంకర రెఫరెన్స్‌తో దర్శకుడు వీరు పోట్ల ఒక కథను వెంకటేష్‌కి వినిపించడం జరిగిందట. అయితే ఈ విషయంపై వెంకటేశ్ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది.
ఈలోగానే ఇది మల్టీ స్టారర్ అనీ .. వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడనే పుకార్లు షికారు చేసాయి తప్ప ప్రస్తుతానికి ఇది మల్టీ స్టారర్ కాదనే విషయం మాత్రం స్పష్టమైపోయింది. ఇక వీరు పోట్లకి వెంకీ ఓకే చెప్పడం కూడా కష్టమేననే టాక్ మరోవైపున వినిపిస్తోంది.