Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుణ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ ఇదే... క్రేజీ సినిమాలో రష్మిక..

Advertiesment
varun tej
, సోమవారం, 14 ఆగస్టు 2023 (14:47 IST)
వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎయిర్ ఫోర్స్‌ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం సోమవారం ప్రకటించింది. బిగ్గెస్ట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అనే టైటిల్‌ ఫైనల్‌ చేశారు. తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్‌ 8న ఇది విడుదల కానుంది. మానుషి చిల్లార్‌ కథానాయిక.
 
అలాగే, ‘విరూపాక్ష’తో ఈ ఏడాది విజయాన్ని అందుకున్నారు దర్శకుడు కార్తిక్‌ దండు. సుకుమార్‌ రైటింగ్స్‌ - శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (ఎస్‌వీసీసీ) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కాగా, ‘విరూపాక్ష’ మేకర్స్‌ ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌ కోసం కలిశారు. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కార్తిక్‌ దర్శకత్వం వహించనున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ - ఎస్‌వీసీసీ సంయుక్తంగా దీన్ని నిర్మించనున్నాయి. ప్రీ ప్రొడెక్షన్‌ వర్క్స్‌ కూడా మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్కారు నౌకరితో ఆకాష్ సింగర్ సునీత పేరు నిలబెడతాడా!