Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలకృష్ణ సినిమాలో కీల‌క పాత్ర‌లో వరలక్ష్మి శరత్‌కుమార్

బాలకృష్ణ సినిమాలో కీల‌క పాత్ర‌లో వరలక్ష్మి శరత్‌కుమార్
, బుధవారం, 5 జనవరి 2022 (15:22 IST)
Balakrishna, Varalakshmi
అఖండ‌తో నటసింహ నందమూరి బాలకృష్ణ,  క్రాక్‌తో  దర్శకుడు గోపీచంద్ మలినేని ఇద్దరూ తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌లను అందించారు, తాజాగా మ‌రో మాస్ ట్రీట్‌ను అందించడానికి  సిద్ధంగా వున్నారు. అందుకోసం  పక్కా మాస్, కమర్షియల్ సినిమాగా తీర్చ‌దిద్ద‌డానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా ముందుకువ‌చ్చారు.
 
 
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది, ఇందులో శాండల్‌వుడ్ స్టార్ దునియా విజయ్  ప్రతినాయకుడిగా నటించనున్నారు. వ‌ర్కింగ్ టైటిల్‌ #NBK107 అని పేరు పెట్టబడిన ఈ చిత్రం నటీనటులందరికీ ప్రాముఖ్యతనిస్తుంది.
 
గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క్రాక్‌లో బిన్న‌మైన పాత్ర‌ను చేసి మెప్పించిన వరలక్ష్మి శరత్‌కుమార్ #NBK107లో కూడా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను పోషించడానికి ముందుకు వచ్చారు. క్రాక్‌లో తన నటనతో ఆశ్చర్యపరిచిన ఈమె భారీబడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో భాగం కావడం ప‌ట్ల చిత్ర యూనిట్ సంతోషంగా వుంది.
 
మాస్‌ హీరో, మాస్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మాస్‌కి ఫుల్‌ మీల్‌ ట్రీట్ ను అందించబోతోంది. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని లుక్‌లో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు అద్భుత‌మైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు, అంతేకాకుండా కథ నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించారు.
 
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.
 
గోపీచంద్ మలినేని సినిమాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటాయి.అంతేకాకుండా ప్రాజెక్ట్ కోసం ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల పరంగా #NBK107 కోసం ద‌ర్శ‌కుడు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
 
ఎస్ థమన్ సౌండ్‌ట్రాక్‌లను అందించగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించ‌నున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ క్రాఫ్ట్స్‌మెన్ నవీన్ నూలి ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. రామ్-లక్ష్మణ్ జంటగా ఫైట్స్ చేయనున్న ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
ఈ నెల నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
 
 
తారాగణం: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్
 
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీత దర్శకుడు: థమన్ ఎస్
DOP: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
CEO: చిరంజీవి (చెర్రీ)
కో-డైరెక్టర్: కుర్రా రంగారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం KVV
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆహారంలో క‌ల్తీపై సినిమా "క్యూ" మొదలైంది!