Varalakshmi Sarath Kumar look
వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, హెబ్బాపటేల్ తదితరులు నటిస్తున్న సినిమా `ఆద్య`. శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో P.S.R. కుమార్ ( బాబ్జి, వైజాగ్ ), S.రజినీకాంత్. నిర్మిస్తున్నారు. శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, వింటేజ్ పిక్చర్స్ బ్యానర్ మీద, డి.ఎస్.కె. స్క్రీన్ సమర్పిస్తున్నారు. ఆద్య చిత్రానికి ఎం.ఆర్.. కృష్ణ మామిడాల దర్శకత్వం వహించనున్నారు.
నేడు అనగా శనివారంనాడు వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆద్య సినిమాలోని ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ ఆమె సరికొత్తగా కనిపించారు. ఇప్పటికే ఈ లుక్‌కు మంచి స్పందన లబిస్తోంది. గత జనవరి 5నే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇదిలా వుండగా, " షికారు " తరువాత శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ బేనర్ మీద శ్రీ బాబ్జి నిర్మిస్తున్నద్వితీయ చిత్రం `ఆద్య`.
నటీనటులు : వరలక్ష్మి శరత్ కుమార్, ఆశిష్ గాంధీ, విశ్వ కార్తీక్, హెబ్బాపటేల్, కన్నడ కిషోర్, అమితా రంగనాధన్, రాజా రవీంద్రా, సూర్య తదితరులు నటిస్తున్నారు.
సాంకేతికవర్గంః సహ నిర్మాత: పి. సాయి పావెం కుమార్, సంగీతం- మణిశర్మ, కెమెరా- డి.శివేంద్ర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎం.ఆర్.కృష్ణ మామిడాల, బేనర్- శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్, వింటేజ్ పిక్చర్స్, ప్రెజెంట్స్: DSK స్క్రీన్,. నిర్మాతలు: PSR కుమార్ (బాబ్జీ) - & - రజనీకాంత్. ఎస్, ఫైట్స్ : రామ్ - లక్ష్మణ్