Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'వానర సైన్యం' షార్ట్ ఫిల్మ్ విశేషాలు..

Advertiesment
Vanara Sainyam Short Film
, ఆదివారం, 17 ఏప్రియల్ 2016 (16:12 IST)
కిరణ్ కుమార్ దర్శకత్వంలో వన్ విజన్ స్టూడియో పతాకంపై పర్వతనేని రాంబాబు నిర్మించిన లఘుచిత్రం 'వానర సైన్యం'. ఇందులో పర్వతనేని రాంబాబు, చోటు, చెర్రీ, నరేన్, కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన తారాగణం. శనివారం హైదరాబాద్‌లో ప్రసాద్ లాబ్స్‌లో ఈ షార్ట్ ఫిల్మ్ షో వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది మాట్లాడుతూ... "షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. అందరూ బాగా యాక్ట్ చేశారు. యుట్యూబ్‌లో ఈ ఫిల్మ్‌కు మంచి హిట్స్ రావాలి" అని అన్నారు. 
 
కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ "కామెడీ చాలా బాగుంది. మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి షార్ట్ ఫిల్మ్స్ బాగా ఉపయోగపడతాను. మన తప్పులను కరెక్ట్ చేసుకోవచ్చు. పెద్ద సినిమాల్లో ఆ ఛాన్స్ ఉండదు. ఇందులో నటించిన అందరికీ మంచి చాన్సులు రావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. 
 
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ "రాంబాబు జర్నలిస్టుగా పనిచేస్తూ నిర్మాతగా మారాడు. జర్నలిస్టులకు సినిమా మీద మంచి అవగాహన ఉంటుంది. 'వానరసైన్యం'తో ఆయన మంచి నిర్మాతగా ఎదగాలి" అని అన్నారు. 
 
పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ "కిరణ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మించాను. అందరూ బాగా నటించారు. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడానికి వన్ విజన్ స్టూడియో స్థాపించాను" అని అన్నారు. 
 
కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ "యాక్టర్ అవుదామని వచ్చాను. కొన్ని కారణాలతో ఈ షార్ట్ ఫిల్మ్ చేశాను. అందరూ సపోర్ట్ చేస్తారని, మాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు. 
 
తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్న కుమార్, ఎం.ఎస్.రెడ్డి, అనీల్ కృష్ణ తదితరులతో పాటు 'వానర సైన్యం' యూనిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
--------

Share this Story:

Follow Webdunia telugu