Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి ని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Advertiesment
Vamsi Krishna invites Megastar Chiranjeevi

దేవీ

, శనివారం, 22 నవంబరు 2025 (17:44 IST)
Vamsi Krishna invites Megastar Chiranjeevi
మహా గ్రూప్ ఆధ్వర్యంలో, మహా భక్తి ఛానల్ సారథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారిచే నిర్వహించబడుతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నవంబర్ 26న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా మహా గ్రూప్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించారు. నంబర్ 26వ తేదీన సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో ప్రత్యేక పూజలు, శ్రీవారి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.
 
ఈ సందర్భంగా మారెళ్ళ వంశీకృష్ణ మాట్లాడుతూ... ఈరోజు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి చిరంజీవి గారిని ఆహ్వానించేందుకు కలవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆయన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరగాలని ఆశీర్వదించడం మాకు ఎంతో పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చింది. చిరంజీవి గారిని నేను సత్కరించి వెంకటేశ్వర స్వామి పటాన్ని అందించగా ఆయన వెంటనే నాకు డిజిటల్ భగవద్గీత అందజేయడం అనేది మరింత గుర్తుండిపోయే విషయం. ఇటువంటి కార్యక్రమాలకు ఆయన సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని చిరంజీవి గారు చెప్పడం మాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది" అన్నారు.
 
ఈ సందర్భంగా మారెళ్ళ వంశికృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారిని శాలువాతో సహకరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్