Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ హీరోయిన్లా..? వీసా ఇచ్చేది లేదు.. శివానీ రాజశేఖర్‌కి ఇవ్వనన్నారట?

తెలుగు చిత్ర పరిశ్రమని మొన్న క్యాస్టింగ్ కౌచ్, నిన్న సెక్స్ రాకెట్ వివాదం చుట్టుముట్టింది. సెక్స్ రాకెట్ కేసు ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్ హీరోయిన్స్ ఇందులో

Advertiesment
Tollywood
, గురువారం, 26 జులై 2018 (18:06 IST)
తెలుగు చిత్ర పరిశ్రమని మొన్న క్యాస్టింగ్ కౌచ్, నిన్న సెక్స్ రాకెట్ వివాదం చుట్టుముట్టింది. సెక్స్ రాకెట్ కేసు ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్ హీరోయిన్స్ ఇందులో ఇరుక్కున్నారని ప్రచారం జరుగుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని అమెరికాలో నడిపిస్తున్న కిషన్, అతడి భార్య చంద్ర కళ ప్రస్తుతం యూఎస్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో వీరిద్దరినీ కోర్టు నిందితులుగా తేల్చింది. 
 
ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్లకు కొత్త సమస్యొచ్చిపడింది. టాలీవుడ్ హీరోయిన్లు అమెరికా వెళ్ళాలన్నా, అక్కడి నుంచి ఇండియాకు రావాలన్నా.. అక్కడి పోలీసులు సవాలక్ష ప్రశ్నలేస్తున్నారు. అంతేగాకుండా సినిమా సెలెబ్రిటీలకు అమెరికా సర్కారు వీసా రూల్స్‌ను మరింత కఠినతరం చేయనుందట. అమెరికాకు వెళ్లే హీరోయిన్ల పూర్తి వివరాలు పక్కాగా వుంటేనే వీసాను మంజూరు చేస్తున్నారు. ఫలితంగా అప్పుడప్పుడు షోలు, సినిమా షూటింగ్‌లంటూ అమెరికాకు వచ్చే హీరోయిన్ల సంఖ్య ఇక తగ్గిపోనుంది. 
 
అమెరికా సర్కారు వీసా రూల్స్‌ను కఠినతరం చేయడంతో.. టాలీవుడ్‌కు తెరంగేట్రం చేసిన యంగ్ హీరోయిన్, రాజశేఖర్-జీవిత దంపతుల కుమార్తె శివానీకి కష్టాలు తప్పలేదు. శివానీ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యే ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మెయిన్ షెడ్యూల్ అమెరికాలో జరగాల్సింది. అయితే శివానీ బ్యాడ్ లక్.. ఆమెకు వీసా దొరకలేదు. ఆమెతో పాటు ఆ సినిమాలో నటించే మరికొందరు నటీమణులకు కూడా వీసా దొరకలేదు. దీంతో సినీ యూనిట్ ‌లొకేషన్‌ను మార్చేసింది. లండన్‌‍కు షూటింగ్‌ను షిప్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో అడవిశేష్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏయ్ దూరంగా జరుగు... జాన్వీని టచ్ చేయబోయిన ఫ్యాన్...