Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యలో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్

Advertiesment
Urvashi Rautela
, శుక్రవారం, 4 నవంబరు 2022 (16:31 IST)
Urvashi Rautela
మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రేక్షకులు కోరుకునే  అన్ని అంశాలు ఉంటాయి. మాస్ మహారాజా రవితేజ ప్రజన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్. చిత్రంలో చిరంజీవి, రవితేజ ఇద్దరిపై మెగా మాస్ నంబర్‌ వుంది. ఈ పాటని ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించారు
 
అంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై ఓ భారీ సెట్‌లో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించనున్నారు. దీనికోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫుట్ ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేయగా, టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. లావిష్ ప్రొడక్షన్ డిజైన్‌కు పేరుపొందిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌ డేట్‌ అంచనాలను పెంచుతోంది. తప్పకుండా సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక పండగలా వుంటుంది. 
 
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.
 
ఆర్థర్ ఎ విల్సన్ కెమెరా మెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
 
ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యపై ఇనయా ప్రేమ.. ఓవరాక్షన్.. ప్లేటు లేకపోతే తినదట..