Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Advertiesment
Raviteja, sreelela

దేవీ

, సోమవారం, 14 ఏప్రియల్ 2025 (16:27 IST)
Raviteja, sreelela
రవితేజ 75వ చిత్రం మాస్ జాతర. శ్రీలీల నాయిక. ఈ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. దీనిని భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. తు మేరో లవర్.. అంటూ దివంగత సంగీత దర్శకుడు చక్రి పాడిన పాటగా విడుదల చేశారు. ఈ వాయిస్ ను ఎ.ఐ. టెక్నాలజీతో పాడించారు. గతంలో రవితేజ, చక్రి కాంబినేషన్ లో పలు విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా 'తు మేరా లవర్'ను విడుదల చేశారు.
 
ప్రోమోతోనే అందరి దృష్టిని ఆకర్షించిన 'తు మేరా లవర్' గీతం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూశారు. తాజాగా విడుదలైన ఈ పాట, ఒక్కసారి వినగానే శ్రోతలకు అభిమాన గీతం మారిపోతోంది. ధమాకా జోడి రవితేజ-శ్రీలీల అందరి అంచనాలను అందుకునేలా, అద్భుతమైన కెమిస్ట్రీతో మరోసారి మ్యాజిక్ చేశారు. ప్రేక్షకులకు వెండితెరపై పూర్తి స్థాయి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ పాటతో చెప్పకనే చెప్పేశారు.
 
సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో 'తు మేరా లవర్' గీతాన్ని అద్భుతంగా స్వరపరిచారు. భాస్కరభట్ల సాహిత్యం మాస్ మెచ్చేలా ఉంది. రవితేజ బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఇడియట్‌'లోని ఐకానిక్ చార్ట్‌బస్టర్ "చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే" పాటకు ట్రిబ్యూట్ గా మలిచిన 'తు మేరా లవర్' అభిమానులకు విందు భోజనంలా ఉంది. దీనిని ఒక ప్రత్యేకమైన సంగీత నివాళిగా మార్చడానికి నిర్మాతలు కృత్రిమ మేధస్సు(AI) ని ఉపయోగించి దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని తిరిగి సృష్టించారు. రవితేజ శైలి ప్రత్యేక డ్యాన్స్ స్టెప్పులు, శ్రీలీల అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఈ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 
 
దర్శకుడు భాను బోగవరపు రవితేజ అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా 'మాస్ జాతర'ను మలుస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న తన ప్రభావవంతమైన విజువల్స్ తో పాటకి తగ్గట్టుగా మాస్ వైబ్‌ను అద్భుతంగా చూపించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 
 
రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా 'మాస్ జాతర' రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని