Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీడియాకు నేనో ఐటెం.. ఛస్తే ఎలాగూ నరకానికే వెళ్తాను : రాంగోపాల్ వర్మ

తెలుగు సినిమా దశ, దిశను మలుపు తిప్పిన దర్శకుల్లో ఒకరని రాంగోపాల్ వర్మ అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. మూస సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో శివ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమను ఓ కుదుపు కుదిపేశాడు.

Advertiesment
మీడియాకు నేనో ఐటెం.. ఛస్తే ఎలాగూ నరకానికే వెళ్తాను : రాంగోపాల్ వర్మ
, బుధవారం, 3 మే 2017 (15:14 IST)
తెలుగు సినిమా దశ, దిశను మలుపు తిప్పిన దర్శకుల్లో ఒకరని రాంగోపాల్ వర్మ అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. మూస సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో శివ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమను ఓ కుదుపు కుదిపేశాడు. శివ సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినిమా పరిశ్రమ గురించి చెప్పాల్సి వచ్చినపుడు శివకు ముందు, శివకు తర్వాత అనే ప్రస్తావన వచ్చేది. శివ తర్వాత ఎందరో సినీ ప్రేమికులకు దర్శకుడిగా మారాలనే ఆలోచనను పుట్టించింది కేవలం రాంగోపాల్ వర్మ అని బల్లగుద్ది చెప్పవచ్చు. అలాంటి వ్యక్తి అయిన వర్మ పరిస్థితి చాలా నీచంగా ఉంది. మానసిక ప్రవర్తన, తీసే సినిమాలు చాలా నాసిరకంగా ఉంటున్నాయి. దీనికి నిదర్శనం ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న ట్వీట్లే ప్రధాన కారణం. తాజాగా చేసిన ట్వీట్‌ను ఓసారి పరిశీలిస్తే... 
 
ప్రతిరోజూ ఉదయం తాను పుడతానని, మళ్లీ రాత్రి చచ్చిపోతానని చెబుతున్నాడు. తాను ట్విట్టర్ రాజుని కాదని అన్నాడు. ఇంకా చెప్పాలంటే తానో జోకర్‌‌నని పేర్కొన్నాడు. ఇతరులపైనే కాదు, తనపై కూడా తాను జోకులు వేస్తుంటానని ఆయన అన్నారు. అయితే ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకుంటారని అభిప్రాయపడ్డారు.
 
ఇకపై ఇతరులను తప్పుగా విమర్శించనని వినాయకుడిపై ఒట్టేశానని ఆయన తెలిపారు. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌‌గానే ఉంటా కానీ నెగిటీవ్‌‌గా వ్యాఖ్యలు చేయనని ఆయన చెప్పారు. తన జీవితం జర్నీలాంటిదని అన్నారు. ప్రతి ఉదయం కొత్తగా జన్మించి, రాత్రికి చనిపోతానని ఆయన అన్నారు. 
 
అందుకే ఏం చేసినా ఈ మధ్యలో ఉన్న పన్నెండు గంట్లోనే చేసేస్తానని ఆయన తెలిపారు. ఈ రోజుకి హాయిగా జీవించడమే తన లక్ష్యమని అనుకుంటానని ఆయన అన్నారు. చచ్చాక ఖచ్చితంగా నరకానికే వెళతానని తనకు తెలుసని, అందుకే బతికున్నన్ని రోజులు ఎంజాయ్‌ చేస్తూ ఇక్కడే స్వర్గాన్ని వెతుక్కుంటానని ఆయన చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేట్ దంపతుల సన్ బాత్ ఫోటోలు లీక్.. కోర్టులో విచారణ.. డయానా అందుకే చనిపోయిందా?