Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్రిబాణధారి బార్బరిక్ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్

Barbaric Striking Motion Poster

డీవీ

, బుధవారం, 6 నవంబరు 2024 (17:30 IST)
Barbaric Striking Motion Poster
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ మేకర్లు ఎక్కువగా మైథలాజికల్ కాన్సెప్ట్‌తో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. రామాయణ, మహాభారతాల్లోంచి పాత్రలను తీసుకుని సినిమాలను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్భరిక్ (బార్బరికుడు) మీద చిత్రం రాబోతోంది. త్రిబాణధారి బార్బరిక అంటూ అదిరిపోయే టైటిల్‌తో చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మించిన ఈ మూవీకి  మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
 
ఎవరు తాతా ఇతను?.. ప్రపంచం గుర్తించని ఒక గొప్ప యోధుడమ్మా.. భీష్ముడా? తాతా.. హహ కాదమ్మా..  అంటూ సాగిన డైలాగ్స్.. ఇచ్చిన ఎలివేషన్స్.. ఆర్ఆర్, విజువల్స్ ఇలా అన్నీ కలిపి మోషన్ పోస్టర్ అంచనాలు పెంచేసింది. చూస్తుంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు సరిపోయే పాన్ ఇండియన్ కథలా కనిపిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని ఆ స్థాయిలోనే అన్ని భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
 
ఏకకాలంలో మూడు బాణాలు వేయడంలో బార్బరికుడు నేర్పరి. అందుకే త్రిబాణధారి అని టైటిల్‌లోనే పెట్టేశారు. ఇక మోడ్రన్ కాలం నాటి తుపాకులు, బుల్లెట్లు కూడా ఈ మోషన్ పోస్టర్‌లో చూపించారు. గాండివదారి అర్జున, పాశుపశాస్త్రం, బ్రహ్మాస్త్రం, గరుడ పురాణం వంటి పుస్తకాలను కూడా ఈ వీడియోలో చూపించారు. మరి ఆ కాలానికి, ఈ కాలానికి కథను ఎలా లింక్ చేశారో చూడాలి.
 
ఈ మోషన్ పోస్టర్ అనేది దర్శకుడి గొప్ప విజన్ కి, క్వాలిటీ మేకింగ్ పట్ల నిర్మాతల అంకితభావానికి నిదర్శనంగా ఉంది. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా ఇన్ఫ్యూషన్ బ్యాండ్ అనే బ్యాండ్ సంగీతాన్ని అందించింది. వీడియోకు సంబంధించిన థీమ్ మ్యూజిక్ గూస్‌బంప్స్ ఇస్తోంది. 
 
ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ఉధయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
 ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి, ఎడిటర్‌గా మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ పున్న బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను రామ్ సుంకర పర్యవేక్షిస్తున్నారు.
 
ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ పోస్ట్-ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. బార్బరిక్ మోషన్ పోస్టర్‌ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇక నుంచి మున్ముందు అప్డేట్లతో మేకర్లు సందడి చేయనున్నానరు
 
తారాగణం: సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర, మరియు ఉధ్యభాను

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివారెడ్డిని ఇండస్ట్రీలో తొక్కేసింది సీనియర్ కమేడియనా? మేనేజరా?