Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నువ్వున్నంత వరకు తెలుగు సినిమాల గురించి మాట్లాడే మగాడింకా పుట్టలేదు రాజమౌళి మామా': నాని

ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన "బాహుబలి 2" చిత్రంపై హీరో నాని తనదైనశైలిలో స్పందించాడు. ఈ చిత్రాన్ని తిలకించిన తర్వాత నాని ఓ ట్వీట్ చేశాడు. ఇంతకీ నాని సోషల్ మీడియా ద్వారా ఏమన్నాడంటే... 'నువ్వు మా

Advertiesment
Baahubali 2
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (13:00 IST)
ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన "బాహుబలి 2" చిత్రంపై హీరో నాని తనదైనశైలిలో స్పందించాడు. ఈ చిత్రాన్ని తిలకించిన తర్వాత నాని ఓ ట్వీట్ చేశాడు. ఇంతకీ నాని సోషల్ మీడియా ద్వారా ఏమన్నాడంటే... 'నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామా' అన్నాడు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
 
కాగా, కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఓ ఒక్క సినీ అభిమానిని కదిపినా... వినిపించేది ఒకటే మాట... 'బాహుబలి-2: ద కన్ క్లూజన్'. ఈ రెండున్నర గంటల చిత్రం గురించి గత మూడేళ్ళుగా మాట్లాడుకుంటున్నారు. ఇపుడు చిత్రం విడుదలయ్యాక మరింతగా చర్చల్లో మునిగిపోయారు. 
 
ఇక... తాము పుట్టిందే సినిమాలకని భావించి... జీవితమే సినిమాలపై ఆధారపడిన నటీనటులు ఇంకెంత మాట్లాడాలి?... అలా మాట్లాడిన వారిలో హీరో నాని ఒకరు. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన తొలి అద్భుతం 'ఈగ' సినిమాలో ప్రధాన పాత్ర పోసించిన నటుడు నాని బాహుబలి గురించి ఆసక్తిగా ట్వీట్ చేయడం ప్రతి ఒక్కరినీ ఎంతో ఆకర్షించింది.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా... భారతదేశంలో మాత్రమే ఇలా జరుగును...