Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్

Advertiesment
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్
, శుక్రవారం, 2 జులై 2021 (10:36 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన అనేక మందికి క్లీన్ చిట్ లభించింది. ఈ కేసులో ఏ ఒక్క సినీ ప్రముఖుడికి సంబంధం లేనట్టు తాజా సమాచారం. 
 
గతంలో టాలీవుడ్‌లో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ కేసు స‌ర్వ‌త్రా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. అనేక మంది ప్రముఖుల పేర్లు ఈ కేసులో వెలుగులోకి వ‌చ్చాయి. చార్మి, ముమైత్ ఖాన్‌, త‌రుణ్‌, న‌వ‌దీప్‌, త‌నీష్‌తో పాటు ప‌లువురి ప్ర‌ముఖుల‌ను స్పెషల్ సెల్ పోలీసులు విచారించారు. 
 
విచార‌ణ‌కు హాజ‌రైన టాలీవుడ్ ప్రముఖుల రక్తం, జుట్టు, గోరు నమూనాలను కూడా పోలీసులు సేకరించారు. హీరో రవితేజ సోదరుడు భ‌రత్ ఓ ప్రమాదంలో మరణించిన తర్వాత డ్ర‌గ్స్ వ్య‌వ‌హరం వెలుగులోకి వ‌చ్చింది. 
 
అతని మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు మాదకద్రవ్యాల రాకెట్టును కనుగొనేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో విచార‌ణ అనంత‌రం 2 జులై, 2017న 11 మంది టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి 30 మందిని అరెస్టు చేశారు. 
 
హైద‌రాబాద్ ప‌రిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అనేక మంది డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును పూర్తిగా విచారించిన పోలీసులు సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ గురించి తాజా అప్డేట్.. ఏంటదో తెలుసా?