Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ ప్రచారానికి దూరంగా ఎన్టీఆర్.. ప్రేక్షక పాత్ర వహించిన సినీ స్టార్స్

టీడీపీ ప్రచారానికి దూరంగా ఎన్టీఆర్.. ప్రేక్షక పాత్ర వహించిన సినీ స్టార్స్
, మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (15:51 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధం వేడిపుట్టించింది. తెలంగాణలో తెరాస బలం తప్ప ప్రతిపక్షం నామా మాత్రంగా ఉండటంతో వార్ వన్‌సైడ్‌గా మారనుంది. తెరాస కోరుకున్నట్లు 16 సీట్లు గెలుచుకుంటే అంతకు మించిన సంతోషం వారికి ఉండదు. ఒకటి రెండు సీట్లు తగ్గినా వారికి అంత విచారం ఏమీ ఉండదు. అయితే ఆంధ్రలో మాత్రం వాతావరణం విభిన్నంగా ఉంది. వైకాపా, టీడీపీ మధ్య ఎన్నికల హోరు రసవత్తరంగా సాగుతుండగా, ఇందులో జనసేన కూడా చేరడంతో పోటీ ఆసక్తిగా మారింది. పార్టీలు సినీ స్టార్‌లను ప్రచారంలో వాడే ప్రయత్నాలు చేసినా కొందరు తప్పించి ఎవరూ పాలుపంచుకోలేదు. 
 
ముఖ్యంగా జనసేన తరపున మాత్రమే కొందరు బరిలోకి దిగారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఎన్టీఆర్ మాత్రం ఇందుకు ఆసక్తి చూపలేదు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం దెబ్బకి బాబు ఎన్టీఆర్‌ని ప్రచారంలో దింపాడు. అయితే రోడ్డు ప్రమాదం కారణంగా ఎన్టీఆర్ ప్రచారాన్ని మధ్యలోనే ముగించాడు. అప్పటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. 
 
తెలంగాణ ఎన్నికలలో తన సోదరి పోటీ చేసినా ప్రచారానికి నో అంటే నో అని చెప్పేశాడు. 2009 ఎన్నికల తర్వాత తన తండ్రికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్న ఎన్టీఆర్‌తో తండ్రి మరణం తర్వాత చంద్రబాబు రాజీ కుదుర్చుకోవాలనుకున్నాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం లొంగలేదు. తాజాగా జరగబోయే ఎన్నికల కోసం ప్రచారానికి తారక్‌ని రమ్మన్నా రాలేదు. ఎన్నికల జోరును ప్రేక్షకుడిగా చూస్తూ ఉండటానికి నిర్ణయించుకుని కూల్‌గా ఉండిపోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేట తర్వాత మురుగదాస్‌తో దర్బార్ చేస్తున్న రజనీ.. పోలీస్ ఆఫీసర్‌గా?