Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

`తిమ్మ‌రుసు`రాబోయే సినిమాల‌కు ఆక్సిజ‌న్‌లా మారాలిః నాని

Advertiesment
`తిమ్మ‌రుసు`రాబోయే సినిమాల‌కు ఆక్సిజ‌న్‌లా మారాలిః నాని
, బుధవారం, 28 జులై 2021 (16:53 IST)
Timmarasu prrelease
`లాక్‌డౌన్ త‌ర్వాత అన్నింటితో పాటు థియేట‌ర్స్‌ను ఓపెన్ చేయ‌వ‌చ్చు కదా! ఇది నానిగా నేను మాట్లాడటం లేదు. ప్రేక్ష‌కుడిగా మాట్లాడుతున్నాను. థియేట‌ర్ అనేది మ‌న జీవితంలో ఓ భాగ‌మైపోయింది. ఇంటి త‌ర్వాత ఎక్కువ‌గా థియేట‌ర్స్‌లోనే గ‌డిపి ఉంటాం. జాగ్ర‌త్తలు తీసుకుని వెళితే, థియేట‌ర్స్ చాలా సేఫ్ ప్లేస్‌. ఫిజిక‌ల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మెంట‌ల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్‌. మెంట‌ల్ హెల్త్‌కు మూల కార‌ణాలైన ఆర్ట్‌ఫామ్స్ ఎక్క‌డైతే ఎక్కువ‌గా ఉన్నాయో, ఆ దేశాల్లో ప్ర‌శాంత‌త ఎక్కువ‌గా ఉంటుంది. మ‌న దేశంలో సినిమాకు మించిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేదు. థియేట‌ర్స్ అనేది పెద్ద ఇండ‌స్ట్రీ. దానిపై ఆధార‌ప‌డి ల‌క్ష‌లాది కుటుంబాలున్నాయి` అని నాని చెప్పారు.
 
స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `తిమ్మ‌రుసు`. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్‌పై మ‌హేశ్ కోనేరు, సృజ‌న్ ఎర‌బోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ‌ర‌ణ్ కొప్పి శెట్టి ద‌ర్శ‌కుడు. జూలై 30న సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా నేచుర‌ల్ స్టార్ నాని పాల్గొన్నారు. బిగ్ సీడీ, లిఫ్ట్ ప్రోమో, దేవి థియేట‌ర్ 70 ఎం.ఎం.బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. విజ‌య‌వాడ‌లోని శైల‌జా థియేట‌ర్ బిగ్ టికెట్‌ను నిర్మాత మ‌హేశ్ కోనేరు తండ్రి సాంబ‌శివ‌రావు ఆవిష్క‌రించారు. 
 
ఈ సంద‌ర్భంగా నాని మాట్లాడుతూ ``స‌త్య‌దేవ్ అంటే చాలా ఇష్టం. త‌న‌పై ఉన్న అభిమానంతో ఈ ఈవెంట్‌కు వ‌చ్చాను. స‌త్య‌దేవ్ ఎంత మంచి యాక్ట‌రో మ‌న‌కు తెలుసు. ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య సినిమాలో ఆత్మ‌ను ఓ న‌టుడిగా రీ క్రియేట్ చేయ‌డం త‌న‌కే సాధ్య‌మైంది. వేరే దేశాల్లో వీకెండ్స్ వ‌స్తే అమ్మ‌, నాన్న‌ల‌ను చూడ‌టానికి వెళ‌తారు. కానీ మ‌నం అమ్మ‌, నాన్న‌ల‌తో సినిమాకెళ‌తాం. అలాగే వేరే దేశాల్లో వీకెండ్స్‌లో ఫ్రెండ్స్‌ను క‌ల‌వ‌డానికి వెళ‌తాం. కానీ మ‌నం ఫ్రెండ్స్‌తో పాటు సినిమా కెళ‌తాం.. బోర్ కెడితే బార్ కెళ్లి అటు నుంచి థియేట‌ర్ కెళ‌తాం. థియేట‌ర్స్‌లో సినిమా చూడ‌టం అనేది మ‌న సంస్కృతి. సాధార‌ణంగా కోవిడ్ టైమ్‌లో ముందుగా థియేట‌ర్స్ క్లోజ్ చేసేసి, లాస్ట్‌లో థియేట‌ర్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. బార్స్‌, ప‌బ్స్‌లో మాస్కులు తీసేసి పెద్ద‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వాటితో పోల్చితే థియేట‌ర్స్ సేఫ్ ప్లేస్ అని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఈ 30 త‌ర్వాత వ‌చ్చే సినిమాల‌న్నింటికీ తిమ్మ‌రుసు అనేది ఆక్సిజ‌న్ ఇవ్వాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు. 
 
webdunia
Sathadev
ఇండ‌స్ట్రీ అనేది ఓపెన్ యూనివ‌ర్సిటీః స‌త్య‌దేవ్ 
``ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అనేది ఓపెన్ యూనివ‌ర్సిటీ. ఇక్క‌డ క్వాలిఫికేష‌న్స్‌, ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్‌, మార్కులు ఏమీ ఉండ‌వు. ప్యాష‌న్ అనే క్వాలిఫికేష‌న్‌తో రావాలి. 99 మంది మ‌న‌కు ఇండ‌స్ట్రీ గురించి ఎన్నో చెబుతారు. కానీ ఒక‌రు మాత్ర‌మే ఏం కాదు..ముందుకెళ్లు అని చెబుతాడు. ఆ ఒక‌రెవ‌రో కాదు. మ‌న‌కు మ‌న‌మే. అలా ఎంతో ధృడ‌మైన న‌మ్మ‌కంతో, ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కున్న వ్య‌క్తుల్లో మైడియ‌రెస్ట్ నాని అన్న ఒక‌రు. త‌ను ఇక్క‌డ‌కు రావ‌డం వ‌ల్ల‌, మాలాంటి వాళ్ల‌కు ఎంతో ధైర్యం వ‌స్తుంది. నాని అన్నంటే నాకు చాలా చాలా ఇష్టం. నా ఫ‌స్ట్ అఫిషియ‌ల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది. చాలా సంతోషంగా ఉంది. 39 రోజుల్లో సినిమా పూర్త‌య్యింది. సెకండ్ వేవ్‌లో ముందుగా వ‌స్తోన్న ఈ సినిమాను ఆద‌రించి స‌పోర్ట్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌కు కోరుకుంటున్నాను`` అన్నారు.  
 
నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ, సినిమాను చేసేట‌ప్పుడు ఎంతో ఎఫ‌ర్ట్‌తో చేశాం. అలాగే సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాం. ప్రాజెక్ట్ ఇంత బాగా రావ‌డానికి కార‌ణ‌మైన అంద‌రికీ థాంక్స్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా సినిమా మంచి స‌క్సెస్‌ను సాధిస్తుంది. స‌క్సెస్ త‌ర్వాత ఇంకా మాట్లాడుతాను. జూలై 30న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ, కోవిడ్ టైమ్‌లో రిస్ట్రిస్ట్ర‌క్ష‌న్స్ ఉన్నా స‌రే! స‌త్య‌దేవ్‌తో పాటు ప్రియాంక జ‌వాల్క‌ర్‌, బ్ర‌హ్మాజీ, ఝాన్సీ, అజ‌య్‌, వైవా హ‌ర్ష అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. అప్పూ ప్ర‌భాక‌ర్ మంచి విజువ‌ల్స్ ఇచ్చాడు. శ్రీచ‌ర‌ణ పాకాల రాక్ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే నాకు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. అంద‌రం క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి సినిమా చేశాం. సెకండ్ లాక్డౌన్ త‌ర్వాత రిలీజ్ అవుతున్న ఈ సినిమా అంద‌రూ జాగ్ర‌త్త‌గా థియేట‌ర్స్‌లో చూడాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 
 
హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ మాట్లాడుతూ, స‌త్య‌దేవ్‌తో వ‌ర్క్ చేసిన త‌ర్వాత యాక్టింగ్ ఈజీగా, ప్యాష‌నేట్‌గా ఉండాలో అర్థ‌మైంది. త‌న యాక్టింగ్‌ను చూసిన‌ప్పుడు నేనేం నేర్చుకోవాలో తెలిసింది అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బార్లు - పబ్బులకు లేని ఇబ్బంది థియేటర్లకు ఎందుకు : హీరో నాని