Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మార్పు రావాలి : కౌశిక్, విజయ్ రెడ్డి పిలుపు

Advertiesment
Kaushik, Vijay Reddy

డీవీ

, గురువారం, 30 జనవరి 2025 (11:46 IST)
Kaushik, Vijay Reddy
ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ (AATT) ఎన్నికలు ఈసారి పోటీపోటీగా జరగబోతున్నాయి. 25 ఏళ్ళనాడు స్థాపించిన ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ (AATT) కు ఇప్పటివరకు వినోద్ బాల, విజయ్ యాదవ్ అధ్యక్ష, కార్యదర్శులుగా వున్నారు. కానీ ఈసారి మాత్రం కౌశిక్ ఆధ్వర్యంలో యూత్ టీమ్ పోటీకి నిలబడింది. ఇప్పటివరకు చేసిన సేవలు చాలు ఒకసారి మాకు అవకాశం ఇవ్వండని కౌశిక్ పానల్ కోరుతోంది.

నాగబాబు ఆశీస్సులతో వినోద్ బాల ప్రోత్సాహంతో హరి (నాగబాబు బంధువు) పానల్ పోటీచేస్తుండగా, కౌశిక్ పానల్ పోటీగా నిలిచింది. ఇంకోవైపు సెల్వరాజ్ ప్యానల్ కూడా పోటీచేస్తుంది. అయితే ప్రధాన పోటీ హరి, కౌశిక్ ప్యానల్ మధ్యే నడుస్తుంది.
 
రెండేళ్ళపాటు వుండే ఈ పదవుల కోసం పోటీపోటీగా హామీలు ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళల సమస్యల కోసం ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తామని, పరబాషా నటీనటులు ఒక్కరు మినహా సీరియల్స్ లో లేకుండా చేసేలా చర్యలు తీసుకుంటామని, మెడిక్లయిమ్ లు, టీవీ నగర్ ఏర్పాటుకు క్రిషి చేస్తామని హరి పేనల్ చెబుతుంది. కౌళిక్ మాట్లాడుతూ, గత కొన్నేళ్ళుగా మేం చెబుతున్న సమస్యలను పట్టించుకోని ముందు కమిటీ ఇప్పుడు మా మానిఫెస్టోను కాపీాకొట్టి అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ మాట్లాడుతుంది. ఇప్పటివరకు అసోసియేషన్ లో ఎటువంటి అవకతవకలు జరగలేదు. కానీ మారిన టెక్నాలజీ రీత్యా మేం అప్ డేట్ అయి చిన్న పెద్ద కళాకారుల తేడా లేకుండా అందరికీ తగిన మంచి చేయాలని నడుంకట్టాం. ఇందుకు  అందరి సహకారం కావాలని తెలిపారు. టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మార్పు రావాలని అధ్యక్ష కార్యదర్శులకు పోటీచేస్తున్న కౌశిక్, విజయ్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
 
ఇక కొందరు సభ్యులైతే మా వాడు, మా కులం అంటూ ప్రచారం చేస్తున్నారనీ, ఇంకా ఎంతకాలం కులం, కులంఅంటూ అభివ్రుద్ధికి ఆటంకటం కలిగిస్గారు? నాకు మొదట అవకాశం ఇచ్చింది కమ్మవారు, ఆ తర్వాత కాపు వారు, ఆ తర్వాత రెడ్డివారు అన్ని కులాలు మతాల వారు టీవీ నిర్మాతలుగా వున్నారు. ముస్లిం నిర్మాతలు కూడా అందరికీ అవకాశాలు ఇచ్చారు. అవన్నీ వదిలేసి మా వాడు అంటూ మాట్లాడి అసోసియేషన్ అభివ్రుద్ధికి ఆటంకంం కలిగించవద్దని క్ౌశిక్ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మానిఫెస్టో చూపిస్తూ ఏం చేస్తామో చెప్పి చేశారు. కానీ అలాంటిది లేదీ మరో పార్టీ ఏమయిందో తెలిసిందే అంటూ పోలుస్తూ మాట్లాడారు. ఎవరి గెలిచినా, ఓడినా అందరూ కలిసి అసోసియేషన్ అభివ్రుద్ధికి క్రిషి చేస్తామని పేర్కొన్నారు. 
 
గతంలో నిర్మాతలనుంచి దాదాపు 14 లక్షలు రావాల్సి వున్నా ముందు అసోసియేషన్ ఏమీ చేయలేకపోయింది. వ్యక్తిగతంగా నేను లాస్ అవ్వాల్సివచ్చింది.  నాలాగా ఎంతో మంది కళాాకారులు లాస్ అయ్యారు. పరాబాషా నటీనటులు మన తెలుగువారిపై దాడిచేసిన సంఘటనలు కూడా వున్నాయి. కానీ ముందు అసోసియేషన్ సాల్వ్ చేయలేకపోయింది. అందుకు కౌశిక్ ప్యానల్ ను గెలిపిస్తే ఇటువంటి ఇబ్బందులు వుండని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి