Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

Advertiesment
Kaulas Kota movie opeing

దేవీ

, బుధవారం, 2 జులై 2025 (18:03 IST)
Kaulas Kota movie opeing
మాదాల నాగూర్ నిర్మాణంలో, పీఎస్పీ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కౌలాస్ కోట’. ఈ చిత్ర పోస్టర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఘనంగా నిర్వహించారు.  అద్వైత్ క్రియేషన్స్ బ్యానర్‌పై, మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ సమర్పణలో రూపొందుతోంది.
 
ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ మాదాల నాగూర్ మాట్లాడుతూ, డైరెక్టర్ పీఎస్పీ శర్మతో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. రియ‌ల్ కోట ప్రాంగ‌ణంలోనే షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయి. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను ఖచ్చితంగా సంపాదించుకుంటుందని నమ్మకంగా చెబుతున్నాను” అన్నారు.
 
దర్శకుడు పీఎస్పీ శర్మ మాట్లాడుతూ –“స్టోరీ, స్క్రీన్‌ప్లే విషయంలో చాలా కష్టపడ్డాం. రచయిత ఎర్రా సంజీవరాజ్ ఈ కథను ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అంశాలపై పరిశీలన చేసి, కథా మాటలు అందించారు. ఈ సినిమాలో గ్రాంథికతతో పాటు ప్రజెంట్ సిట్యూషన్స్‌కు అనుగుణంగా సన్నివేశాలు ఉంటాయి. నవరసాలతో పాటు వినూత్నత కలిగిన ఈ ‘కౌలాస్ కోట’ చిత్రం విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.
చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది.
 
నటీనటులు:దిల్ రమేష్, జబర్దస్త్ చంటి, జబర్దస్త్ వెంకీ, చిట్టిబాబు, లల్లి మధుమిత, టైగర్ బాబురావు, జనగామ రాజు, ఆర్టిస్ట్ శంకర్, కేరళ షాహెద్, కుమారి లక్ష్మీ, పీసుపాటి భరద్వాజ్, హరి మమత, మేఘమాల, బేబీ భవ్య తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం